Turmeric Water : మహిళలు ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
చాలామంది ఉదయం లేవగానే నీటిని తాగే అలవాటు ఉంటుంది. కొందరు గోరువెచ్చని నీటిని తాగుతుంటారు. మరి కొందరు నార్మల్ నీళ్ళని తాగుతూ ఉంటారు. అయితే ఇవి కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగితే ఎన్నో రకాల ఉపయోగాలు పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. పసుపు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. పసుపులో ఎన్నో రకాల యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపులోని చెడి బ్యాక్టీరియాని చంపి జీవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే కడుపు సంబంధించిన సమస్యలను […]
ప్రధానాంశాలు:
Turmeric Water : మహిళలు ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
చాలామంది ఉదయం లేవగానే నీటిని తాగే అలవాటు ఉంటుంది. కొందరు గోరువెచ్చని నీటిని తాగుతుంటారు. మరి కొందరు నార్మల్ నీళ్ళని తాగుతూ ఉంటారు. అయితే ఇవి కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగితే ఎన్నో రకాల ఉపయోగాలు పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. పసుపు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. పసుపులో ఎన్నో రకాల యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపులోని చెడి బ్యాక్టీరియాని చంపి జీవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే కడుపు సంబంధించిన సమస్యలను నుంచి బయటపడవచ్చు.. పసుపు నీళ్లు ముఖ్యంగా పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.
వీటిని తాగడం వల్ల కండరాల నొప్పులు తలనొప్పి తగ్గుతాయి… ఇది వంటకు రంగుతోపాటు రుచికరంగాడ ఉంటుంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇది క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ తగ్గిస్తుంది. పసుపులో ఉండే ఎన్నో సమ్మేళనాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తే వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది కర్కుమిన్. మీకు ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వలన కలిగే ఎన్నో ఉపయోగాల గురించి చూద్దాం. చాలామంది పదేపదే జలుబు, దగ్గు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు పసుపు నీటిని తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో మీరు ఎనర్జిటిక్ గా ఫీట్ గా ఉంటారు.. ఇది శరీరాన్ని లోపల నుండి వెచ్చగా ఉంచుతుంది. శక్తితో నిండి ఉంటుంది.
మరీ ముఖ్యంగా శీతాకాలంలో పసుపు నీళ్లు తాగడం వలన ఫిట్గా ఉంటారు.ఏ కాలంలో అయినా జలుబు, దగ్గు, జ్వరం, కీలనొప్పిలు వస్తూ ఉంటాయి. మన రోగనిరోధక శక్తి బలహీనపడుతూ ఉంటుంది. అయితే జలుబు దగ్గు లాంటి వ్యాధులను నివారించడానికి పసుపు తయారు చేసిన వేడి నీటిని అత్యంత ప్రభావంతమైన రెమెడీగా ఉపయోగపడుతుంది. దీని తయారీ విధానం : ముందుగా నీటిని మరిగించాలి. తర్వాత దానిలో సోంపు, అల్లం ముక్కలు కొంచెం పసుపు వేయాలి. ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత దానికి తేనే నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉండగానే త్రాగాలి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో సాయంత్రం ఈ నీటిని తాగితే రోగనిరోశక్తి పెరిగి ఎలాంటి వ్యాధులుకైనా చెక్ పెట్టవచ్చు..