Health Tips : గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదాన్ని ఈ చెట్టు బెరడు తో చెక్ పెట్టవచ్చు…!!
Health Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పులు వలన గుండె జబ్బులు కొలెస్ట్రాల్ రక్తపోటు ఇంకా ఎన్నో సమస్యలతో ఇబ్బంది చాలామంది బాధపడుతున్నారు.. అయితే ఇటువంటి ప్రమాదాల నుంచి ఈ చెట్టు బెరడుతో తగ్గించుకోవచ్చు.. ఈ చెట్టు బెరడుతో ఇలా చేయడం వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబులు, ఇంకా ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. చెట్లను ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి చెట్ల ఉపయోగంతో ఎన్నో తీవ్రమైన అనారోగ్యాలకు ఆయుర్వేదంలో చికిత్స చేస్తున్నారు. చెట్లు మొక్కలలో ఉండే కొన్ని సంకేతాలు పలు రకాల రోగాలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అటువంటిదే అర్జున చెట్టు. తెల్ల మద్ది అని కూడా అంటారు. ఇది పోషకాల బండాగరం అని కూడా పిలుస్తుంటారు.
దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన గుండె జబ్బులు అలాగే కొలెస్ట్రాల్ ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లాంటి కొన్ని రకాల ఔషధ లక్షణాలు దీనిలో ఉంటాయి. దీని తీసుకోవడం వలన గుండె కండరాలు గట్టి పడతాయి. గుండె సరియైన పనితీరుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక పరిశోధన ప్రకారం తెల్ల మద్ది బెరడు సారం 23% క్యాల్షియం లవణాలు 16% టానిన్లు ఇంకా ఎన్నో రకాల ఫైట్ హిస్టరాల్సు ప్లేవనాయిడ్లు లాంటివన్నీ దీనిలో కలిగి ఉంది. అధిక రక్తపోటు గుండె ఆగిపోవడం మయూకార్డియన్, నెప్రోసిస్క్మిక్ అనేక గుండె సంబంధిత పరిస్థితిలో ఈ తెల్ల మద్ది చాలా బాగా సహాయపడుతుంది.
ఈ బెరడు పాలలో ఉడకబెట్టి రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.. అలాగే తెల్ల మధ్యలో యాంటీ ఆక్సిడెంట్ చర్య వలన ప్రీ రాడికల్స్ ప్రమాదకరమైన ప్రభావాల నుండి గుండె కండరాన్ని కాపాడడం వలన గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది కొత్త రక్త కణాలను ఏర్పాటు చేసి రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలంలో గోరువెచ్చటి పాలలో తెల్ల మద్ది బెరడును పొడి అర స్పూన్ వేసి కలుపుకొని త్రాగాలి. ఈ విధంగా చేయడం వలన ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఈ తెల్ల మద్ది చూర్ణము ఒకటి రెండు స్పూన్ల చొప్పున అరకప్పు చక్కెర కలిపిన పాలలో తీసుకుంటే విరిగిన ఎముకలు కూడా త్వరగా కట్టుకుంటాయి