Eggs : కోడిగుడ్డు తినేముందు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eggs : కోడిగుడ్డు తినేముందు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 July 2023,8:00 am

Eggs : గుడ్డు తినడం వలన మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు కదా.. చాలామంది రోజు గుడ్డు తింటూనే ఉంటారు. స్వయంగా ప్రభుత్వమే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గుడ్డు తినమని చెప్పింది అంటే గుడ్డు వలన ఎంతటి ప్రయోజనం ఉందో ఆలోచించండి.. ఒక చిన్న గుడ్డులో ఉండే పోషకాలు ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో చెప్తాను.. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాం.. చెప్పాను కదా గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా.. గుడ్డు తినడం వలన మన ఒంట్లోని కొవ్వు ను అరికట్టవచ్చు.. అంతేకాకుండా మన శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని సరఫరా చేస్తుంది. గుడ్డు తినడం వలన మీ బరువు నియంత్రణలో ఉంటుంది.

గుడ్డులో కేలరీలు ఉన్నాయి.. కానీ వాటి వలన మనం బరువు పెరగడం గుడ్డు తినడం వలన మన కడుపు నిండినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఏది తినాలనుకోమో ఆకలి కూడా అనిపించదు. అలా అవడం వలనే మనము బరువు పెరగకుండా అరికట్టగలం. గుడ్డు మీ కంటికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు మీ ఆహారంలో గుడ్డును చేర్చడం వలన కంటి నరాల క్షీణత నుంచి కాపాడుతుంది. అంతేకాదు రోజు గుడ్డు తినడం వలన శుక్లాల ప్రమాదం కూడా తగ్గుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం గుడ్డు మీ శరీరంలోని రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దాని వలన మీకు బిపి, గుండె జబ్బులు రావడం చాలా వరకు తగ్గుతుంది. రోజు గుడ్డు తినే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా చాలా తక్కువ. అంతేకాదు గుడ్డు తీసుకోవడం వలన మీ మెదడు నరాల పనితీరు చాలా మెరుగుపడుతుంది. అంటే వయస్సు పైబడినాక వచ్చే వ్యాధులు గుడ్డు తినే వాళ్ళలో వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఎప్పుడైనా మీరు శక్తి తగ్గినట్టుగా అనిపిస్తేస్తే వెంటనే ఒక గుడ్డు తినండి.

You must know this before eating chicken eggs

You must know this before eating chicken eggs!

గుడ్డు మీ శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తుంది. సోమరితనాన్ని దూరం చేస్తుంది. గుడ్డుని ఎనర్జీ బూస్టర్ అని కూడా పిలుస్తారు. గుడ్డులో ఒక్క మాటలో చెప్పాలంటే మీ మెదడుకు, గుండెకు, నరాలకు, ఎముకలకు, జుట్టుకు, చర్మానికి, కంటి చూపుకు అన్నిటికీ ఒక్క గుడ్డుతో ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటివరకు తినేవాళ్ళకైతే నేనేం చెప్పను కానీ తినని వాళ్ళు ఉంటే గనక ఈరోజు నుంచి రోజు ఒక గుడ్డు తినడం మొదలు పెట్టండి. ఒక రెండు నెలలు తిన్న తర్వాత మీ ఒంట్లో జరిగే మార్పులు మీరే గమనిస్తారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది