Hyderabad : ఆ సమస్యతో హైదరాబాద్ లో 75% మంది ఇబ్బంది పడుతున్నారు.. ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు..!!
Hyderabad : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలిలో ఎన్నో మార్పులు వలన చాలామంది ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా సరియైన ఆహారం తీసుకోకపోవడం, శారీరిక శ్రమ లేకపోవడం ఈ కారణాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే అపార్ట్మెంట్ కల్చర్లు బాగా పెరిగిపోవడం, ఏసీలలో పెరగడం కారణంగా ఎంతోమంది తగినంత సూర్య తగలకపోవడం దీంతో విటమిన్ డి లోపంతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై టాటా ఎంజి లాబ్స్ పరిశోధన నిర్వహించారు. దీనిలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో సుమారు 76 శాతానికి పైగా విటమిన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. 36% మంది ప్రజలు హైదరాబాద్ లో డి విటమిన్ లోపంతో ఇబ్బంది
పడుతున్నారని పరిశోధనలో బయటపడింది. మరి ప్రధానంగా యువతలో సమస్య అధికంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం సూరత్ 88% ,అహ్మదాబాద్ 85%, వదోదర 89% ఈ సిటీలకు చెందిన ప్రజలు ఎక్కువమంది ఈ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెద్దవారితో పోలిస్తే యువత ఈ లోపం అధికంగా ఉండడం ఆశ్చర్యకరం 25 ఏళ్ల లోపు వాళ్ళు 84% మంది లో 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో 81 మందిలో డి విటమిన్ ఉండాల్సిన లెవెల్స్ లేదని పరిశోధనలో తేలింది. ఈ తరం పిల్లలు శారీరిక శ్రమ తగ్గిపోవడం క్రీడలపై ఆసక్తి తగ్గడం ఇది ముఖ్య కారణం అవుతుంది. అలాగే ఎక్కువ టైం ఏసీ గదులలో ఆఫీసులో గడపడం,ఎండ తగలకపోవడం,
తీసుకునే ఆహారంలో జాగ్రత్త లేకపోవడం ఈ డి విటమిన్ కి కారణం అవుతూ ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో క్యాల్షియం లెవెల్స్ తగ్గిపోయి. బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి పెంచే ఆహారం: సహజంగా ఉదయం ఎండ పడేలా ఉంటే విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తీసుకునే ఆహారం వలన కూడా విటమిన్ డి లోపాని పెంచుకోవచ్చు. చేపలు కొవ్వు, సముద్రపు ఆహారం నుండి అధికంగా ఉంటుంది. ఆవు పాలలో ఎక్కువగా విటమిన్-డి కాలుష్యం ఉంటాయి. ఎక్కువ మొత్తంలో మన శరీరానికి అందుతుంది. ఎముకలను గట్టి పరచడమే కాకుండా కడుపు సమస్యలు కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా శరీరానికి కావాలి విటమిన్ బి12 కూడా అందుతుంది..