Hyderabad..ఖైరతాబాద్ గణనాథుడికి తొలిసారి తలపాగ

0
Advertisement

దేశవ్యాప్తంగా గణనాథుడికి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు వినాయకుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణపయ్య తొలిసారి కొత్త అవతారంలో కనిపించి సందడి చేస్తున్నారు. ఖైరతబాద్ విఘ్నేశ్వరుడు తొలిసారి తలపాగ ధరించాడు. తలపాగ ధరించిన గణనాథుడిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్ ధరించిన మాదిరి తలపాగలను విఘ్నేశ్వరుడు ధరించి ఉన్నాడు. విఘ్నరాయుడికి ఈ తలపాగను చార్మినార్‌కు చెందిన బృందం తయారు చేసింది. 14 అడుగుల వెడల్ప, ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే విధంగా విఘ్నేశ్వరుడికి తలపాగను తయారు చేశారు.

ఇకపోతే తలపాగతో ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు భక్తులు, ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ రోజు గణనాథుడిని దర్శించుకునేందుకుగాను భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రులు జరిగే ఈ విఘ్నేశ్వరుడు ఉత్సవాలలో యువత పెద్ద ఎత్తన పాల్గొంటున్నది. మారుమూల పల్లె నుంచి సిటీ వరకు అన్ని చోట్ల గణేశ్ మండపాలలో విఘ్నేశ్వురుడిని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించుకుని, వేడుకలు చేసుకుంటున్నారు.

 

Advertisement