Hyderabad.. మీ సమస్యలపై ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడండి

Authored By praveen T | The Telugu News | Updated on : 5 September 2021, 11:06 am

సాధారణంగా తమ ప్రాంతంలో ఏదేని సమస్య ఉంటే పరిష్కరించాలని కోరుతూ స్థానిక శాసన సభ్యుడి క్యాంప్ ఆఫీసుకో లేదా ఆయన ఎక్కుడుంటే అక్కడకు జనం వెళ్తుండటం మనం చూడొచ్చు. అయితే, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యం. కాగా, హైదరాబాద్‌లోని ముషీరాబాద్ శాసన సభ్యుడు ముఠా గోపాల్ ప్రజలు తనను డైరెక్ట్ కాంటాక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇందుకుగాను ‘హలో ఎమ్మెల్యే’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.

ఈ రోజు అనగా ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నేరుగా ప్రజలతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడుతారు. ఈ సమయంలో ప్రజలు ఎవరైనా నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లొచ్చు. గతంలో ఆయన ఇలా ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుని పరిష్కరించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ‘హలో ఎమ్మెల్యే-3’ సెషన్ ద్వారా సమస్యలు నేరుగా శాసన సభ్యుడు ముఠా గోపాల్‌కు తెలపాలని ప్రజలను టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇందుకుగాను 9704146374 నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఇబ్బందులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లొచ్చు.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి