Phone Calls Voice : మీ ఫోన్‌లో పరమ చిరాకు తెప్పించే మహిళ మరెవరో కాదు.. ఈమె వాయిస్ వింటేనే..!
ప్రధానాంశాలు:
Phone Calls Voice : మీ ఫోన్‌లో పరమ చిరాకు తెప్పించే మహిళ మరెవరో కాదు.. ఈమె వాయిస్ వింటేనే..!
Phone Calls Voice : సోషల్ మీడియా Social Media లో మనం నిత్యం అనేక సవాళ్లని ఎదుర్కొంటున్నాం. సైబర్ నేరగాళ్లు యదేచ్ఛగా అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. అయితే వారికి అవగాహన కల్పించేందుకు గాను మనం ఎవరికి ఫోన్ చేసిన కూడా ఒక గొంతు వినిపించేలా ప్లాన్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఒక అమ్మాయి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తోంది. అయితే, అర్జెంట్ అయి, ఏదైనా కోపంలో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ వాయిస్ విని కోపంతో రగిలిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు.

Phone Calls Voice : మీ ఫోన్‌లో పరమ చిరాకు తెప్పించే మహిళ మరెవరో కాదు.. ఈమె వాయిస్ వింటేనే..!
Phone Calls Voice విసిగించే అమ్మాయి ఈమెనేనా?
ఇలా పదే పదే విసిగించే అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆరాలు కూడా తీసారు. అయితే ఈ వాయిస్ అందించిన యువతి ఎవరో కాదు.. రేడియో మిర్చి RJ అమ్రిత Amrita. ఓ ఈవెంట్ కి హాజరైన అమ్రిత ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆర్జే అమ్రిత గతంలో దేవర సినిమా విషయంలో ట్రోలింగ్ ఎదుర్కోవడం మనం చూశాం.
ఇటీవల జూ. ఎన్టీఆర్ NTR దేవర సినిమా చూసిన తర్వాత అందులో జాన్వీ పాత్ర గురించి ఒక అరనిమిషం నిడివి గల ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది అమృత. ఇంకేముంది పచ్చిబూతులు తిడుతూ 3200 కామెంట్లు చేశారట. అంతేకాకుండా డైరెక్ట్ మెసేజ్‌లు, కాల్స్, వాయిస్ మెసేజ్‌లతో నన్ను చంపేస్తామంటూ బెదిరించారు. అసలు అలాంటి బూతులు నేను ఈ ప్రపంచంలోనే ఎవరూ వాడరు అనుకున్నాను అని చెప్పుకొచ్చింది.
