Traffic Rules : హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా
Traffic Rules : హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. హైదరాబాద్ లో ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు పాటించడం లేదు. దీంతో ట్రాఫిక్ జామ్ అవడం లేదంటే యాక్సిడెంట్స్ అవడం జరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా కూడా వాహనదారులు వినడం లేదు. దీంతో చేసేది లేక.. ట్రాఫిక్ నిబంధనలను హైదరాబాద్ పోలీసులు కఠినతరం చేశారు. రూల్స్ అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించనున్నారు.
ఎక్కువగా వాహనదారులు రాంగ్ రూట్ లో నడిపి, ట్రిపుల్ రైడింగ్ చేసి రూల్స్ అతిక్రమిస్తుంటారు. అందుకే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాళ్లకు రూ.1700 జరిమానా విధించాలని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. అలాగే.. ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్లకు రూ.1200 జరిమానా విధించనున్నారు. ఈనెల 28 నుంచి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని…
Traffic Rules : ఈ నెల 28 నుంచి ప్రత్యేక డ్రైవ్
భారీగా జరిమానా విధిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారుల భద్రత కోసం, ట్రాఫిక్ ను నియంత్రించడం కోసమే స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. గత మూడేళ్లలో కేవలం రాంగ్ రూట్, ట్రిపుల్ డ్రైవింగ్ చేసి దాదాపు 100 మంది వాహనదారులు తమ ప్రాణాలనే కోల్పోయారని.. అందుకే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు కోరారు.