Hyderabad Kidnap Case : వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. గోవాలో నవీన్ రెడ్డి అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు
Hyderabad Kidnap Case : హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసు ఒక కొలిక్కి వచ్చింది. వైశాలిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిబట్ల పోలీసులు.. గోవాలో అరెస్ట్ చేశారు. వైశాలి కిడ్నాప్ తర్వాత నవీన్ రెడ్డి గోవాకు పారిపోయాడు. నవీన్ రెడ్డితో పాటు అతడితో ఉన్న ఏ6 నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

police arrested mister tea naveen reddy in goa
వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారు. మిగితా నిందితులు ఎక్కడ తలదాచుకున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే వైశాలి కేసులో అసలు నిజాలు బయటికి వస్తున్నాయి.
Hyderabad Kidnap Case : వైశాలి, నవీన్ రెడ్డికి స్పోర్ట్స్ అకాడెమీలో పరిచయం
నిజానికి.. వైశాలి, నవీన్ రెడ్డికి స్పోర్ట్స్ అకాడెమీలో పరిచయం ఏర్పడింది. గత సంవత్సరమే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య పెద్ద అనుబంధం లేనప్పటికీ తనతో ఉన్న చిరు పరిచయాన్ని అడ్డు పెట్టుకొని తనతో కలిసి ఫోటోలు దిగిన నవీన్.. కొన్ని రోజులకే తన ముందు పెళ్లి ప్రస్తావనను పెట్టాడు. కాకపోతే తన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే తనను వివాహం చేసుకుంటా అని వైశాలి తేల్చి చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి తెగ ప్రయత్నాలు చేశాడు. కానీ.. వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో అతడు ఉన్మాదిగా మారి.. వైశాలిని అన్ని విధాలా హింసించడం స్టార్ట్ చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. తన ఇంటి దగ్గరికే షిఫ్ట్ అయ్యాడు. చాలాసార్లు వైశాలి ఇంటి ముందు రచ్చ రచ్చ చేసిన నవీన్.. ఈనెల 9 న వైశాలి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకొని తన అనుచరులతో కలిసి వెళ్లి వైశాలి ఇంటిపై దాడి చేసి తనను ఎత్తుకెళ్లాడు. తనను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని భావించినా.. మీడియాలో తన గురించి వార్తలు వస్తుండటంతో.. వైశాలిని వదిలేసి గోవా పారిపోయాడు.