Hyderabad : హైదరాబాద్ లో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్.. 300 ఏళ్ల నాటి మెట్ల బావి ఈరోజు పున:ప్రారంభం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : హైదరాబాద్ లో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్.. 300 ఏళ్ల నాటి మెట్ల బావి ఈరోజు పున:ప్రారంభం

 Authored By kranthi | The Telugu News | Updated on :5 December 2022,8:30 am

Hyderabad : హైదరాబాద్ లో చాలా టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. అందరికీ తెలిసిన టూరిస్టు ప్లేసులు చాలా ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే టూరిస్టు ప్లేసులకు కేరాఫ్ అడ్రస్. కానీ.. 300 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన మెట్ల బావి గురించి మీకు తెలుసా? అది నగరంలోని బన్సీలాల్ పేటలో ఉందని తెలుసా? దానికి చాలా విశిష్టత ఉంది కానీ.. చాలామందికి దాని గురించి తెలియదు. అది బన్సీలాల్ పేటలో ఉంది.

renovated step well in bansilalpet to inaugurate today in hyderabad

నగరం నడిబొడ్డున ఉన్న ఆ పర్యాటక కేంద్రం ప్రస్తుతం టూరిస్టు స్పాట్ అయింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరీ పునరుద్ధరించింది. దాని పునరుద్దరణ పనులు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో దానికి మంత్రులు కేటీఆర్, తలసాని ఇవాళ ప్రారంభించనున్నారు. బన్సీలాల్ పేటలో ఉన్న ఈ బావిలో ఉన్న 500 టన్నుల చెత్తను వెలికి తీశారు సిబ్బంది.

Hyderabad : అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మలిచిన మెట్ల బావి

దాన్ని నాగన్న కుంట బావి అని పిలుస్తారు. దాని పునరుజ్జీవనంతో ప్రస్తుతం అది అద్భుతంగా తయారైంది. నగరంలోని చారిత్రక కట్టడాలను జీహెచ్ఎంసీ పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెట్ల బావిని కూడా చాలా రోజుల నుంచి క్లీన్ చేసి దీన్ని టూరిస్ట్ స్పాట్ గా తయారు చేశారు. అక్కడ కూర్చోవడానికి సీటింగ్ తో పాటు గార్డెన్, అంపీ థియేటర్ ను కూడా నిర్మించారు. ఈరోజు నుంచి ఆ బావి దగ్గర టూరిస్టులకు అనుమతి ఉంటుంది. టూరిస్టులు రావడం స్టార్ట్ అయితే ఇక అక్కడ కొత్త కళ సంతరించుకున్నట్టే.

Advertisement
WhatsApp Group Join Now

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది