Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ పరిధిలో ఈనెల 9న ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ఏరియాలకు అస్సలు వెళ్లకండి
Hyderabad Traffic Restrictions : ఈనెల 9న అంటే శుక్రవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దానికి కారణం.. ఈనెల 9న మాదాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మాణ పనుల శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మాదాపూర్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

traffic restrictions in cyberabad region on 9 december 2022
మాదాపూర్ లోని రహేజ ఐటీ పార్క్, మైండ్ స్పేస్ జంక్షన్ లో ఉదయం 7.30 కు ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను అక్కడ అమలు చేస్తున్నారు. అలాగే.. నార్సింగి పీఎస్ పరిధిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధిస్తున్నారు. ఈ సందర్భంగా కావూరి హిల్స్ టు సైబర్ టవర్స్ వరకు, రాబ్ కేబీహెచ్బీ టు సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ టు సైబర్ టవర్స్, టీసీఎస్ జంక్షన్ టు సైబర్ టవర్స్, నీరస్ జంక్షన్ టు పర్వత్ నగర్, ఎన్ఐఏ టు ఎస్బీఐ పర్వత్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
Hyderabad Traffic Restrictions : మొయినాబాద్ నుంచి హిమాయత్ సాగర్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
అలాగే.. మొయినాబాద్ టు హిమాయత్ సాగర్ రోడ్ వరకు, టిపుఖాన్ బ్రిడ్జి టు టీఎస్పీఏ రోడ్ వరకు, నార్సింగి టు టీఎస్పీఏ సర్వీస్ రోడ్స్, రాజేంద్రనగర్ టు టీఎస్పీఏ రోడ్స్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 రీజియన్ లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాజేంద్రనగర్ టు కాళి మందిర్, టిపుఖాన్ బ్రిడ్జి టు మొయినాబాద్, శంషాబాద్ ఓఆర్ఆర్ టు కాళిమందిర్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ టు టీఎస్ఫీఏ, గచ్చిబౌలి సర్వీస్ రోడ్ టు టీఎస్పీఏ, కేపీహెచ్బీ టు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ సైడ్ వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు.