Uppal – Hanuman Nagar : ఉప్పల్, హనుమాన్ నగర్ కాలనీ అభివృద్ధికి రూ.33 లక్షలు మంజూరు చేయించిన కార్పొరేటర్ రజిత
Uppal – Hanuman Nagar : జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి రూ.33 లక్షలు మంజూరు చేయించారు. కాలనీలో కొన్ని రోడ్లు రిపేర్ కు ఉండటం, కొన్ని ప్రాంతాల్లో రోడ్లను తిరిగి వేయించడం, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీని నిధుల కోసం కోరారు. కాలనీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉండి..
ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించిన రజితా పరమేశ్వర్ రెడ్డికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క హనుమాన్ నగర్ కాలనీ మాత్రమే కాదు.. ఉప్పల్ డివిజన్ లోని అన్ని కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం కార్పొరేటర్ రజిత ఎప్పుడు ముందుంటారు. పార్టీలతో సంబంధం లేకుండా డివిజన్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా..
అభివృద్ధి సమస్యలు ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం రజితా పరమేశ్వర్ రెడ్డి గొప్పతనం. హనుమాన్ నగర్ కాలనీ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్న రజితపరమేశ్వర్ రెడ్డికి హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తన తరుపున, కాలనీ తరుపున ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సహాయ సహకారాలు అందించాలని ఈసందర్భంగా కార్పొరేటర్ ను కోరారు.