Tree House : 400 ఏళ్ల చెట్టు మీద ఇల్లును నిర్మించారు.. ఎక్కడో తెలుసా? దాన్ని నిర్మించడానికి కారణం ఏంటి?
Tree House : ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 400 ఏళ్ల క్రితం నాటి చెట్టు అది. అల్లనేరడి చెట్టు అది. ఆ చెట్టు మీద ఇకో ఫ్రెండ్లీ ట్రీ హౌస్ ను నిర్మించారు. దాన్ని నిర్మించింది ఓ జంట. పాల్సన్, ఎల్జా.. భార్యాభర్తలు. వాళ్లది కేరళా. దుబాయిలో స్థిరపడ్డారు. కానీ.. ఎందుకో తాము ప్రకృతికి దూరంగా నివసిస్తున్నామని వాళ్లకు అనిపించింది. దీంతో వెంటనే తమ సొంతూరు అయిన కేరళలోని మున్నార్ కు వచ్చేశారు.
ప్రకృతితో జీవించాలని అనుకున్నారు. దీంతో 400 ఏళ్ల నాటి జామూన్ చెట్టు మీద అందమైన ట్రీ హౌస్ ను నిర్మించారు. మున్నార్ లో పాల్సన్ తాత కొన్నేళ్ల క్రితం కొంత భూమి కొన్నాడట. అందులోనే ఉంది జామూన్ ట్రీ. అది ఇప్పటిది కాదు.. 4 శతాబ్దాల నాటి చెట్టు అని తన తాత ఎప్పుడూ పాల్సన్ కు చెబుతుండేవాడట.దీంతో 2012లో దుబాయ్ నుంచి మున్నార్ వచ్చేశారు పాల్సన్ ఫ్యామిలీ. అప్పుడప్పుడే మున్నార్.. టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతోంది. అప్పుడే ట్రీ హౌస్ ను నిర్మించాలని పాల్సన్ అనుకున్నాడట.
Tree House : టూరిస్ట్ స్పాట్ గా మారిన ట్రీ హౌస్
కేవలం వెదురుబొంగులతో జామూన్ చెట్టు చుట్టూ.. దానికి ఎటువంటి సమస్య లేకుండా ట్రీ హౌస్ ను నిర్మించాడు పాల్సన్. రెండు ఫ్లోర్స్ తో ట్రీ హౌస్ ను నిర్మించాడు పాల్సన్. ఇప్పుడు ఆ ట్రీ హౌస్ కు మున్నార్ లో చాలా డిమాండ్ ఉంది. మున్నార్ కు వచ్చే టూరిస్టులు అక్కడికి వెళ్లకుండా ఉండరు. అక్కడ ట్రిప్స్, క్యాంప్స్ నిర్వహిస్తారు. గెస్టులకు ఇంట్లోనే వండిన ఫుడ్ కూడా అక్కడ అరేంజ్ చేస్తారు. ప్రకృతిని టూరిస్టులు ఎంజాయ్ చేసేలా ఆ ట్రీ హౌస్ ను నిర్మించారు.