Inspirational News : రిటైర్ ఆర్మీ జవాన్.. కూరగాయలు పండిస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Inspirational News : రిటైర్ ఆర్మీ జవాన్.. కూరగాయలు పండిస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :28 August 2023,1:00 pm

Inspirational News : చాలామంది ఏదైనా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక ఏం చేస్తారు చెప్పండి. ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. కానీ.. ఓ ఆర్మీ జవాన్ మాత్రం అలా అనుకోలేదు. తన రిటైర్ మెంట్ తర్వాత జీవితంలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆయన వ్యవసాయం చేయడం ప్రారంభించగానే చాలామంది నవ్వారు. నువ్వేంటి వ్యవసాయం చేయడం ఏంటంటూ ఎగతాళి చేశారు.

కానీ.. తన సొంతూరుకు వచ్చి కూరగాయలు పండిస్తూ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. తనకు ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన ఆదాయం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాడు. తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తన వ్యవసాయ క్షేత్రంలో ముందు బొప్పాయి సాగును ప్రారంభించాడు. ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే సాగు చేస్తూ ఏకంగా రూ.12.5 లక్షలు సంపాదించాడు.బొప్పాయి సాగుతో పాటు అరటి, కూరగాయల సాగును ప్రారంభించాడు రాజేష్. ఆ తర్వాత సోరకాయ సాగుకు శ్రీకారం చుట్టాడు. కేవలం సోరకాయలు అమ్ముతూ రోజుకు రూ.5 వేలు సంపాదిస్తున్నాడు. అంటే కేవలం సోరకాయల ద్వారానే నెలకు రూ.1.5 లక్షల సంపాదిస్తున్నాడు.

retired army officer earning lakhs of rupees with bottle gourd cultivation

retired army officer earning lakhs of rupees with bottle gourd cultivation

Inspirational News : సొరకాయ బిజినెస్ తో లక్షల లాభం

వ్యాపారులే తన పొలం దగ్గరికి వచ్చి కూరగాయలు కొంటుంటారు. సోరకాయ సాగు కోసం ఆయన పెట్టిన ఖర్చు 20 వేలు మాత్రమే. కానీ.. ఆ రైతుకు ఏకంగా నెలకు రూ.1.30 లక్షల లాభం వస్తుంది. ఆర్మీ జవానుగా దేశానికి సేవ చేసిన రాజేష్ ఆ తర్వాత కూరగాయల సాగు చేస్తూ దేశానికే రైతు పెట్టే రైతన్నగా మారాడు. దేశం కోసం తన జీవితాంతం సేవ చేస్తున్న రాజేష్ ను చూసి మనమంతా స్ఫూర్తి పొందాలి. గర్వపడాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది