Bottle Gourd : ఎండాకాలంలో సొరకాయ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..దీని ఔషధ గుణాలు తెలిస్తే షాకే…?
ప్రధానాంశాలు:
Bottle Gourd : ఎండాకాలంలో సొరకాయ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు... దీని ఔషధ గుణాలు తెలిస్తే షాకే...?
Bottle Gourd : మనం నిత్యం తినే కూరగాయలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. కొన్ని ఎండాకాలంలో లభించే కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. అలాంటి కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఎండాకాలంలో తింటే ఇంకా మంచిది. ఎందుకంటే సొరకాయలో అధిక శాతం నీరు కలిగి ఉంటుంది. అలాగే,పీచు పదార్థం కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లో శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది. శరీర బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు, చర్మ సౌందర్యాన్ని కాపాడుటకు సొరకాయ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు రోజువారి ఆహారంలో ఈ సొరకాయని చేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఔషధ గుణాలు లభిస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు…సొరకాయ పౌష్టికాహార విలువలతో నిండి ఉన్న అద్భుతమైన ఔషధం. ఈ సొరకాయ అధికంగా నీటి శాతం ఉంటుంది. దీనిని ఎండాకాలంలో తీసుకుంటే శరీరంలో డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. పీచు పదార్థం ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు సొరకాయని తింటే రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ సొరకాయ. ప్రతిరోజు సొరకాయని ఆహారంలో చేర్చుకుంటే కనుక శరీరానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి. మరి సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Bottle Gourd : ఎండాకాలంలో సొరకాయ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..దీని ఔషధ గుణాలు తెలిస్తే షాకే…?
శరీర ఉష్ణోగ్రత
సొరకాయలో 90% కంటే ఎక్కువ నీరును కలిగి ఉంటుంది. ముఖ్యంగా శరీరాన్ని వేడి వాతావరణం నుంచి తగినంత హైడ్రేట్ గా ఉంచేందుకు మంచి కూరగాయగా పనిచేస్తుంది. వీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. వేడి స్వభావం ఉన్న శరీరం వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలంలో వచ్చే డిహైడ్రేషన్ సమస్యలకు కూడా ఈ సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
జీర్ణ క్రియ
సొరకాయలో అధికంగా పీచు పదార్థం కలిగి ఉంటుంది. ఇది ప్రేవుల కదలికలను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధక సమస్యలు కూడా తగ్గుతాయి. మంచి జీర్ణ క్రియ కోసం సొరకాయలను తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీనివల్ల ప్రేగులలో ఘట్ మైక్రోబయోమ్ సరిగ్గా పని చేస్తుంది.
అధిక బరువు
సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున, కడుపు నిండిన నువ్వు తినే కలిగిస్తుంది. ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది. సొరకాయ సహజ మూత్ర విసర్జన గా పని చేస్తూ, అదనపు నీరు, శరీరంలో విషపదార్థాలను బయటకు పంపుటకు ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గుటకు ఈ సొరకాయ మంచి ఔషధం.
డయాబెటిస్
సొరకాయలో తక్కువ గ్లైసిమిక్ సూచిక కలిగి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. ఇది ఫైబరు కలిగి ఉండడంవల్ల గ్లూకోస్ శోషణను నెమ్మదిస్తుంది .
కాబట్టి, తంలో చక్కర స్థాయిలో అకస్మాత్తుగా పెరగకుండా కాపాడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఈ సొరకాయలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో ఉన్న మొక్కల స్టెరాల్స్ ఉండే ఆరోగ్యానికి మద్దతును ఇస్తుంది.
కాలేయ ఆరోగ్యం
ముఖ్యంగా సొరకాయ ఆయుర్వేదంలో కాలయాన్ని రక్షించుటకు వాడతారు. విష పదార్థాలను బయటకు పంపుటకు ముఖ్యంగా పనిచేస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా కొవ్వు కాలేయ వ్యాధి తగ్గించడంలో సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యం
ఈ సొరకాయలో కొలిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ సొరకాయ మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఆందోళన, ఒత్తిడి, మానసిక స్థితి తగ్గించడంలో సహాయపడుతుంది. సొరకాయ రసం తీసుకున్నట్లయితే నిద్రలేని సమస్య కూడా దూరమవుతుంది. మానసిక అలసటకు సహజ చికిత్సగా కూడా ఉపయోగించవచ్చు.
జుట్టు, చర్మం ఆరోగ్యం
సొరకాయలో విటమిన్ సి, జింక్, ఏంటి ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇది చర్మ వృద్ధాప్యాన్ని తగ్గించి, జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. మొటిమలు, చర్మం మంటలను తగ్గించడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
కిడ్నీ సమస్యలు
సొరకాయ సహజ మూత్ర విసర్జన గా పని చేస్తుంది. ఈ సొరకాయ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి వేస్తుంది. పిండాల పనితీరు కూడా సరిగ్గా జరుగుతుంది. మూత్రపిండాల దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు దీన్నిమితంగా తీసుకోవాలి.