Categories: Jobs EducationNews

Government Jobs : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా ?

Government Jobs : ప‌లు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు, సంస్థలు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్య‌ర్థులు వీటిలో ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సినవి నోటిఫికేష‌న్స్‌ ఏవో చూద్దాం.

Government Jobs SSC కానిస్టేబుల్(జీడీ)

అస్సాం రైఫిల్స్‌, బీఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్, సీఏపీఎఫ్ వంటి రక్షణ దళాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. SSC అధికారిక పోర్టల్ ను సంద‌ర్శించి అక్టోబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 39,000 పైగా ఖాళీలు భర్తీ కానున్నాయి.

ఎస్‌బీఐ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1,497 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. IT సిస్టమ్స్ డొమైన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ కింద అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌బీఐ పోర్టల్ విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు.

ఇండియ న్ ఆర్మీ : ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ jointerritorialarmy.gov.in విజిట్ చేసి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అప్లై సెప్టెంబర్ 27లోపు అప్లికేషన్ ఫారమ్‌ను పంపాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 10 ఖాళీలు భర్తీ కానున్నాయి.

NTPC : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ntpc.co.in విజిట్ చేసి సెప్టెంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రికల్, సివిల్ కన్‌స్ట్రక్షన్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి విభాగాల్లో మొత్తంగా 250 ఖాళీలను సంస్థ భర్తీ చేయనుంది. అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం రూ. 70,000 నుంచి రూ.2,00,000 మధ్య ఉంటుంది.

Government Jobs : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా ?

ఐటీఐ  అప్రెంటిస్‌షిప్ : ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR), ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 13న ముగుస్తుంది. మెరిట్ ఆధారంగా 198 మందిని ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.

నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్‌షిప్ : నార్త్ సెంట్రల్ రైల్వే-ప్రయాగరాజ్‌లో అప్రెంటిస్‌షిప్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐటీఐ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు అక్టోబర్ 15న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1,679 ఖాళీలు భర్తీ కానున్నాయి.

Recent Posts

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

32 minutes ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

2 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

3 hours ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

4 hours ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

5 hours ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

6 hours ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

7 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

8 hours ago