
Telangana Jobs : నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్స్
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సన్నద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ఇప్పటికే టీజీపీఎస్సీకి అందించింది.
Telangana Jobs : నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్స్
వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈఓలు, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు, ఎస్‌సీఈఆర్‌టీలోని అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకులతో పాటు మొత్తం 134 పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ 2022లోనే అనుమతి ఇచ్చింది. ఇందులో 24 డిప్యూటీ ఈఓ, 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఈ 134 పోస్టులతో పాటు తాజాగా దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో 8 ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్‌కు ప్రతిపాదనలు అందాయి. మొత్తంగా 142 పోస్టులకు త్వరలోనే 5 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ పరిధిలో మొత్తం 72 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉండేవి. ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున గతంలో కేటాయించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు రెండే ఉన్నప్పటికీ.. జనాభా, పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ఒక్క జిల్లాకే ఏకంగా 12 పోస్టులు రానున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు పెరిగాయి. దీంతో 28 పోస్టులను మంజూరు చేయాలని 2 రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం 33 జిల్లాలకు కలిపి కేవలం 12 డీఈఓ పోస్టులే ఉన్నాయి. అదనంగా మరో 21 పోస్టులను మంజూరు చేయాలనీ ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా త్వరలోనే 28 డిప్యూటీ ఈఓ, 21 డీఈఓ పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.