Navodaya Vidyalaya : నవోదయ విద్యాలయం నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల… ఎలా అప్లై చేయాలంటే…!
ప్రధానాంశాలు:
Navodaya Vidyalaya : నవోదయ విద్యాలయం నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల... ఎలా అప్లై చేయాలంటే...!
Navodaya Vidyalaya : తాజాగా నవోదయ విద్యాలయం కమిటీ దాదాపు 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…
Navodaya Vidyalaya : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ కమిటీ నుండి విడుదల కావడం జరిగింది.
Navodaya Vidyalaya : ఖాళీలు…
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. వాటిలో స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ ఆపరేటర్ , జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, మెస్ హెల్పర్ , ల్యాబ్ అటెండెంట్ , అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ , అసిస్టెంట్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , ఫిమేల్ స్టాఫ్ నర్స్ , క్యాటరింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్ , ఎలక్ట్రీషియన్ ప్లంబర్ , లీగల్ ఎన్విఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ టాస్కింగ్ స్టాఫ్ తో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Navodaya Vidyalaya రుసుము…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు దరఖాస్తుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.
Navodaya Vidyalaya ముఖ్యమైన తేదీలు…
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరణ విండో మే 2న తెరవబడుతుంది. అలాగే అధికారిక షెడ్యూల్ ప్రకారం NTA మే 2 నుండి 4 వరకు మూడు రోజులు పాటు దరఖాస్తు ఫారమ్ సవరణ చేసుకోవచ్చు.అప్లై చేసుకున్న వారికి అడ్మిట్ కార్డు మరియు పరీక్ష తేదీని నవోదయ సంస్థ అధికారిక వెబ్ సైట్ లో త్వరలో ప్రకటించనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి….
ఎవరైనా సరే నవోదయ విద్యాలయ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే NTA Exams.nta.ac.in/NVS/ లేదా navodaya.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోగలరు. అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన పత్రాలు, అర్హత వంటి పలు విషయాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.