SBI : త్వ‌ర‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : త్వ‌ర‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

 Authored By ramu | The Telugu News | Updated on :28 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  SBI : త్వ‌ర‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

SBI : బ్యాంక్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌లో SBI PO నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల తేదీ మరియు సమయం ఇంకా ప్రకటించలేదు. అధికారిక నోటిఫికేషన్‌లో ముఖ్యమైన తేదీలు, అర్హతలు, పోస్టుల సంఖ్య, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ మరియు ఇతర వివరాలతో సహా అన్ని వివరాలు ఉంటాయి. 2023లో, నోటీసు సెప్టెంబర్ 6న విడుదల చేయబడింది మరియు రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 2000 పోస్టులను భర్తీ చేసింది.

అదేవిధంగా, 2022లో, నోటీసు సెప్టెంబర్ 21న విడుదల చేయబడింది మరియు రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 22, 2022న ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసింది.

SBI  అర్హత ప్రమాణాలు

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్‌ సెమిస్టర్‌/ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన వారిని గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ప్రిలిమినరీ ఎగ్జామ్  : ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆబ్జెక్టివ్‌ టెస్టు. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. టెస్టుకు గంట సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం 3 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికీ 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు.

SBI త్వ‌ర‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

SBI : త్వ‌ర‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

మెయిన్‌ ఎగ్జామ్ : మెయిన్‌ ఎగ్జామ్‌కు మొత్తం 250 మార్కులు కేటాయించారు. 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్ష, ఆ వెంటనే 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్షకు 3 గంటల సమయాన్ని కేటాయించారు. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 45 ప్రశ్నలు 60 మార్కులు, గంట సమయం ఉంటుంది. డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 35 ప్రశ్నలు 60 మార్కులు 45 నిమిషాల సమయం ఉంటుంది. జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాల సమయం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కులు, 40 నిమిషాల టైమ్ ఉంటుంది. ఇక, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇంగ్లిష్‌లో లెటర్, వ్యాసం రాయాల్సి ఉంటుంది.

గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ : గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఇందులో 20 మార్కులు గ్రూప్‌ డిస్కషన్‌కు, 30 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు శాతం మార్కుల కోత విధిస్తారు. మెయిన్‌, గ్రూప్‌ డిస్కషన్‌ మార్కుల ఆధారంగా ఫైనల్‌ సెలక్షన్‌ ఉంటుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది