సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ అందించిన బీజేపీ స్టేట్ చీఫ్

Authored By praveen T | The Telugu News | Published on: September 3, 2021, 6:02 pm

బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కాగా, ఆయన జన్మదినం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ అందజేస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం శుక్రవారం శుక్రవారం బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అంబులెన్స్ అందజేశారు. రామకృష్ణ చేతుల మీదుగా అంబులెన్స్ తాళాలను ఆస్పత్రి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ ఎంపీ అంబులెన్స్ అందించారని తెలిపారు.

bandi sanjay telangana bjp president karimnagar

bandi sanjay telangana bjp president karimnagar

అంబులెన్స్ ద్వారా పేషెంట్స్‌ను ఆస్పత్రికి తరలించడం ఈజీ అవుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను అంబులెన్స్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఇటీవల పాదయాత్ర షురూ చేయగా, అందులో పాల్గొనేందుకుగాను బీజేపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఇకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమనే బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేయగా, హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp