7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… త్వరలోనే DA పెంపు కు కేంద్రం గ్రీన్ సిగ్నల్…!
ప్రధానాంశాలు:
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలోనే DA పెంపు కు కేంద్రం గ్రీన్ సిగ్నల్...!
7th Pay Commission : అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల డిఏ ను పెంచే విధంగా సాధనలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో డిఏ లో 4 శాతం ఉద్యోగ నియామకాలు పెంచలన్నారు. దీంతో ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం జనవరి మరియు జూలై నెలలో డిఏ అంటే డియర్ నెస్ అలవెన్స్ ఏడాదికి రెండుసార్లు పెంచుతుంది.ఇక ఈ డి.ఏ ను వినియోగదారుల ధర సూచిక ఆధారంగా లెక్కిస్తారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో డి.ఏ ను పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించవచ్చు. ఈ క్రమంలో డీ.ఏ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పింఛన్ దారుల జీతాలు ఎంత పెరుగుతాయో ఒకసారి చర్చించుకుందాం.
అయితే కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ బ్యూరో ప్రతినెల పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక డేటాను విడుదల చేయడం జరుగుతుంది. ఇక దీనిని ఆధారంగా 7వ వేతన సంఘం ప్రకారం జీతం మరియు పెన్షన్ డ్రా చేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ పెంచబడుతుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 46% డి.ఏ ని అందిస్తుంది. CPI IW డేటా ప్రకారం….డి.ఏ 50.26% కి పెరగవచ్చని అంచనా. ఇక కేంద్ర ప్రభుత్వం నేరుగా మూల వేతనాన్ని 4% శాతం నుండి 50% కూడా పెంచవచ్చు. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 18-2023 న డి.ఏ ని పెంచుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇక ఇది జూలై 1 2023 నుండి అమలులోకి వచ్చింది.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించబోతున్న 4 శాతం పెంపు డీ.ఏ జనవరి 1 – 2024 నుండి అమలులోకి వస్తుందని అంటున్నారు. అయితే ఆలస్యంగా డిక్లరేషన్ చేయడం వలన గత నెల డి.ఏ బకాయిలు కూడా అందాయి. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు డి.ఏ పెంచారు. దీని కారణంగా ఉద్యోగి యొక్క జీతం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ నివేదికలో చూపించిన లెక్క ప్రకారం చూసినట్లయితే ఉద్యోగి యొక్క జీతం 53,500 ఉంటే అతని డి.ఏ 46% చొప్పున రూ.24,610 అవుతుంది. ఇక ఈ డి.ఏ 50 శాతానికి పెరిగితే నెలకు రూ.2,140 లాభం వస్తుంది. అదేవిధంగా ఒకరి పెన్షన్ నెలకు 41 వేలు అయితే అతని డి.ఏ 46% చొప్పున 18,906అవుతుంది. ఇక ఈ డి.ఏ పెంపు తర్వాత వారి పెన్షన్ 1,644 పెరగనున్నట్లు తెలుస్తోంది.