7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పంట పండింది.. 13 అలవెన్స్ లు పెంపు మోడీ సర్కార్ వరాల జల్లు..!
7th pay commission : కేంద్రంలో 3వ సారి విజయం సాధించిన ఎన్.డి.ఏ ప్రభుత్వం ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఐతే ఈసారి ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోడీ సర్కార్ గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కి ఇచ్చే డీ.ఏ డియర్ నెస్ అలవెన్స్ ఇదివరకు 4 శాతం పెంచిన కేంద్రం అది ఇప్పటికే 50 శాతానికి చేరుకుంది. ప్రతి ఏటా డీ.ఏ ని పెంచుతూ వస్తున్నారు. ద్రవ్యోల్బణ ప్రభం బట్టి డీ.ఏ ని రెండుసార్లు పెంచుతుంది కేంద్రం.
ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన వారికి కూడా ఈ డియర్ నెస్ రిలీఫ్ వస్తుంది. డీ.ఏ ఇంకా డీ.ఆర్ పెంచడం వల్ల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల లో పెరుగుతుంద ఉంటుంది. ఐతే డీ.ఏ, డీ.ఆర్ పెంచడం అంటూ జరిగితే జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక త్వరలో కొన్ని అలవెన్స్ లు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ అలవెన్స్ లో హె.ఆర్.ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్ కూడా ఉంది.
7th pay commission పెరిగే అలవెన్స్ లు ఏంటంటే
కేంద్రం పెంచబోతున్న ఈ జీతాల వల్ల ఉద్యోగులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే డియర్ నెస్ అలవెన్స్ లు 50% పెరిగితే అలవెన్స్ రేట్లు 25% పెరుగుతాయి. అంటే రివైజ్డ్ పే స్ట్రక్చర్ పై ఇచ్చే డి.ఏ అనేది 50 శాతం చేసుకుంటే అలవెన్స్ రేట్లు కూడా 25 శాతం మేర పెరుగుతుంది. ఈ క్రమంలో స్పెషల్ కమెన్సెటరె (రిమోట్ లొకాలిటీ) అలవెన్స్, సండర్బన్ అలవెన్స్, ట్రైబర్ ఏరియా అలవెన్స్ ఇస్తారు. ఈ అలవెన్స్ లను టఫ్ లొకేషన్ అలవెన్స్ అంటారు. వీటి కోసం నెలకు 1000 నుంచి 5300 రూపాయల వరకు ఉంటాయి. ఇక కన్వేయన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ ఆ ఉమెన్ విత్ డిసెబిలిటీ కూడా పెరుగుతుంది. వీరికి 3 వేల రూపాయల వరకు ఇస్తారు. వీటితో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హౌజ్ రెంట్ అలవెన్స్, స్ప్లిట్ డ్యూటీ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ వంటివి కూడా పెరగాల్సి ఉంది.