Tomato : ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు అయిపోయిన టమాటా రైతు..!!
Tomato : దేశంలో టమాటా ధర ఆకాశాన్ని అంటాయి అనే సంగతి తెలిసిందే. దీంతో పేద మరియు మధ్యతరగతి ప్రజలు టమాట కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. కేజీ దారా దాదాపు 150 రూపాయలకు పైగానే ఉంటూ వస్తున్న క్రమంలో ప్రజలు… టమాటా విషయంలో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మూడేళ్లు టమాటాలు పండించిన రైతులు చాలా నష్టాలు చూశారు.
కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు బట్టి దేశంలో టమాటా పండించిన రైతులు.. లాభాలు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా చాలామంది టమాటా రైతులు ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం దాపరించాయి. అంతగా దేశవ్యాప్తంగా టమాటా ధర పెరిగిపోయింది. ఈ రకంగానే మహారాష్ట్ర పూణేకి చెందిన ఈశ్వర్ గాయ్ కర్ అనే రైతు 12 ఎకరాలలో మూడేళ్ల నుండి టమోటాలు పండించి నష్టాలే చూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల టమాట ధరలు పెరగటంతో ఒక్క నెలలోనే గాయ్ కర్ మూడు కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది.
ఈ సంవత్సరం టమాటా ధర భారీగా పెరగటంతో గత నెల రోజుల్లో ఏకంగా 3,60,000 కిలోల టమాటాలు అమ్మి 3 కోట్ల రూపాయలు ఆర్జించాడు. మరో 80,000 కిలోల పంటతో 50 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాడు. 40 లక్షలు పెట్టుబడి ఖర్చులు పోగా ఈశ్వర్ భారీ లాభాలు చవిచూశాడు.