Central Government : సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం… ఇలా దరఖాస్తు చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Central Government : సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఇలా దరఖాస్తు చేసుకోండి..!
Central Government : చాలామంది ప్రజలకి సొంత ఇల్లు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం కింద ఉచిత ఇల్లును పొందవచ్చు అని చెప్తోంది. ఇల్లు అనేది అందరికీ ముఖ్యమైనది అయినప్పటికీ అందరికీ అందించడం సాధ్యం అవ్వదు.. ధనవంతులు ఎలాగోలా సొంత ఇల్లును కట్టుకుంటారు. అయితే నిరుపేదలకు నిరుపేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు తమ సొంత ఇంటి కలను సహకారం చేసుకోవడం కూడా చాలా కష్ట తరం అవుతుంది..
ఈ విషయాలను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకి కనీసం ఒక చిన్న ఇల్లునైనా నిర్మించుకునేలా కొత్త స్కీములను ప్రవేశపెట్టాలి అనుకుంది. 2024 -25 బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలను తెలిపారు…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన; ఈ స్కీం చాలామందికి చేరువైన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా ఇళ్లను నిర్మించారు. సుమారు 40 లక్షల కాంక్రీట్ ఇళ్లను కట్టించారు. ఈ ప్రాజెక్టు 2014 నుండి సాగుతోంది. మరియు 2025 నాటికి కోటి ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సహకరిస్తున్న బ్యాంకులు; ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి గ్రాంట్లను రిలీజ్ చేసి ఎంతోమందికి సహాయపడుతుంది.. ప్రతి ఒక్కరు తమ ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందడానికి బ్యాంకు నుండి రుణ సౌకర్యాన్ని అందిస్తోంది.. బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు వాణిజ్య సమస్యలు ఇంటి నిర్మాణానికి రుణ సదుపాయాన్ని కల్పిస్తాయని మీరు ఎక్కడ రుణం తీసుకున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ సొమ్ముని తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది..