7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులైలో పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతాలు..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను కేంద్రం పెంచాలి. సంవత్సరానికి రెండుసార్లు డీఏ పెరగాలి. అందులో భాగంగానే గత మార్చిలోనే డీఏ పెరిగింది. 4 శాతం డీఏను పెంచారు. 38 శాతంగా ఉన్న డీఏ పెరిగి 42 శాతం అయింది. జనవరి 1, 2023 నుంచి ఆ డీఏ అమలులోకి వచ్చింది. దానికి సంబంధించిన బకాయిలను కూడా ఉద్యోగులను అందించారు.
ఇక జూన్ లో రెండోసారి డీఏ పెరగాల్సి ఉంది. జూన్ కూడా ముగుస్తుండటంతో ఇంకెప్పుడు డీఏ పెరుగుతుందా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెగ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేటును దృష్టిలో పెట్టుకొని మరో 3 నుంచి 4 శాతం డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా వచ్చే నెలలోనే ఉంటుందని అంటున్నారు. జులైలో డీఏ 4 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న 42 శాతం డీఏ కాస్త 46 శాతం కానుంది.
7th Pay Commission : ప్రస్తుతం ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ లెక్కింపు
అయితే.. ద్రవ్యోల్బణంతో పాటు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏను లెక్కిస్తారు. ప్రస్తుతం ఏఐసీపీఐ ఇండెక్స్ 134.2 పాయింట్స్ కు పెరిగింది. గత జనవరిలో అది 132.8 పాయింట్స్ గా ఉండేది. అంటే.. గత జనవరితో పోల్చితే ఇప్పుడు 1.5 పాయింట్లు పెరిగింది. జూన్ నెలకు సంబంధించి కూడా ఇంకా ఇండెక్స్ విడుదల కావాల్సి ఉంది. అది కూడా విడుదల అయ్యాక.. దాన్ని బట్టి డీఏను పెంచనున్నారు. ఏది ఏమైనా.. రెండోసారి కూడా డీఏ 3 నుంచి 4 శాతం పెరిగితే ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే. భారీగా జీతాలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా లబ్ధి చేకూరనుంది.