7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50 శాతం వరకు పెరగనున్న డీఏ.. త్వరలో 8వ సీపీసీ.. కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది అనే విషయం తెలుసు కదా. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ సమయంలో ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ పెరుగుతుంది. అయితే.. ఈ డీఏ జనవరి 2024 వచ్చే సరికి 50 శాతం దాటబోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. ఇది జనవరి 2023 నుంచి అమలులోకి వచ్చింది. మళ్లీ జూన్ లో పెరగాల్సిన డీఏ.. ఇంకా పెరగలేదు కానీ.. రక్షా బంధన్ లేదా దసరా వరకు పెంచే చాన్స్ ఉంది. మరోసారి 4 శాతం డీఏ పెరగనుంది. అంటే.. 42 శాతం నుంచి 46 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
మళ్లీ వచ్చే సంవత్సరం అంటే జనవరి 2024 వరకు డీఏ కాస్త 50 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏను ఏడో వేతన సంఘం సిఫారసు చేస్తోంది. కానీ.. త్వరలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్న వేయగా.. దానికి సంబంధించిన సమాధానాన్ని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్పుకొచ్చారు.అయితే.. దానికి రిప్లయి ఇస్తూ ఇప్పట్లో కేంద్రం ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకొచ్చే ఆలోచన చేయడం లేదన్నారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా కేంద్రం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై స్పష్టతనిచ్చింది.
7th Pay Commission : ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘం లేనట్టే?
ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకురావడం లేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా, ఏఐసీఐపీ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారని స్పష్టం చేశారు. అంటే.. ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘం లేనట్టే కానీ.. దానికి ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ మాత్రం వచ్చే సంవత్సరం 50 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.