Fact Check : ఓటు వేయకుంటే డబ్బులు కట్ అవుతాయా.. నిజమెంత..?
ప్రధానాంశాలు:
Fact Check : ఓటు వేయకుంటే డబ్బులు కట్ అవుతాయా.. నిజమెంత..?
Fact Check : సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వార్తలు, న్యూస్ వైరల్ అవుతోంది. అందులో నిజం ఏంటో కూడా తెలియట్లేదు. కొన్ని సార్లు అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకొన్ని సార్లు నిజాలను అబద్దాలుగా ప్రచారాలు చేయడం అనేది బాగా అలవాటు అయిపోయింది. దాంతో అసలు నిజం ఏంటనేది తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నెలలోనే నామినేషన్లకు దరఖాస్తులు తీసుకోబోతున్నారు. దాంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ క్రమంలోనే అన్ని పార్టీలు సోషల్ మీడియాను బలంగా వాడుకోవడానికి రెడీ అయిపోయాయి. సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నాయి. తమ పార్టీకే ఓట్లు వేయాలని కోరుతున్నారు.
Fact Check తప్పుడు ప్రచారాలు..
ఈ క్రమంలోనే ఒక పార్టీపై మరో పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని అసత్యపు ప్రచారాలు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే ఏ పార్టీ గెలుపు వారికి ముఖ్యం అనే చెప్పుకోవాలి కదా. అయితే ఇప్పుడు కొన్ని రోజులుగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది చూసిన వారు కూడా నిజమే అనినమ్ముతున్నారు. ఎందుకంటే కొన్ని పేపర్లలో కూడా ఆ న్యూస్ రావడం ఇక్కడ జరిగింది. అదేంటంటే.. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీ అకౌంట్ నుంచి రూ.350 కట్ అవుతుందని ఆ న్యూస్ లో ఉంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ఆ డబ్బులు కట్ అవుతాయని న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఒకవేళ అకౌంట్ లో డబ్బులు మెయింటేన్ చేయకపోతే.. ఫోన్ రీచార్జ్ వేసుకునే సమయంలో అయినా కట్ అవుతాయని అందులో ఉంది. ఇలా ఒకరిద్దరితో మొదలైన ఈన్యూస్ కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి చేరుకుంది. దాంతో ఎన్నికల సంఘం దానిపై స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పూర్తిగా అవాస్తవం అనితెలిపింది. ఓటు వేయకుంటే డబ్బులు కట్ అవుతాయనేది పూర్తిగా అబ్బదం అని చెప్పింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అధికారులు. కాబట్టి దాన్ని ఎవరూ నమ్మవద్దని చెబుతున్నారు.