Vote : పెళ్లి కన్నా ఓటు ముఖ్యం.. పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కూతురు.. వీడియో !
ప్రధానాంశాలు:
Vote : పెళ్లి కన్నా ఓటు ముఖ్యం.. పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కూతురు..!
Vote : లోక్‌సభ సమరానికి తెరలేసింది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. తొలి విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎండలు మండుతున్నా కూడా ముసలి వాళ్లు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. కాసిమేడు ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన వారం రోజుల వయసున్న చిన్నారితో పాటు ఓటు వేయడానికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం ప్రతీ ఒక్కరి విధి అని, ప్రతీ ఒక్కరూ తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓటు వేయాలంటూ ఆ మహిళ పిలుపునిచ్చారు..
Vote : ఓటు ఫస్ట్.. తర్వాత ఏదైన
ఇక ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌కి చెందిన దీప అనే అమ్మాయి పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు వేసిన అనంతరం అందరూ ఓటు వేయాలని వధువు విజ్ఞప్తి చేశారు. దేశం, తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని వధువు అన్నారు. అలానే జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కథువా మొత్తం పెళ్లి ఊరేగింపుతో పాటు ఓటు వేయడానికి వచ్చి సందడి చేశారు. ఒకవైపు పెళ్లి పనులతో బిజీగ ఉంటున్న చాలా మంది వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు.తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజకీయ నేతలు, ప్రముఖులు.
శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్ఛిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగతున్నాయి.
పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కూతురు
ఉత్తరప్రదేశ్ – ముజఫర్నగర్లో దీప అనే అమ్మాయి పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. pic.twitter.com/aDJaJLSn5b
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2024