Farmers : రైతులకు రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు.. త్వరపడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతులకు రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు.. త్వరపడండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతులకు రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు.. త్వరపడండి..!

Farmers : రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్యాంకులు రుణాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పంట రుణాలతో వారిని ప్రోత్సహించేందుకు ఇప్పటికే చాలా పథకాల కింద ప్రభుత్వాలు వీటినిప్రవేశ పెట్టాయి. అయితే ఇప్పుడు రైతలు పంటలు పండించేందుకు ఎలాంటి వడ్డీలేని రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వ్యవసాయం కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందడానికి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. వాటిని అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ రుణాన్ని పొందవచ్చిన బ్యాంకర్లు చెబుతున్నారు. ఇంతకీ వాటికి ఏం కావాలో, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు RTC (హక్కులు, పదవీకాలం మరియు పంటల రికార్డు) లేదా భూమి పహాణి, ప్రస్తుత సంవత్సరం భూమి రెవెన్యూ రసీదుతో పాటు భూమి కొటేషన్ (MR) లాంటి పత్రాలు ఉంటే భూమిపై అప్పు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. దాంతో పాటు భూమి ర్వే నెంబర్ ను, దాని స్థానాన్ని అంతే కాకుండా వాటిని అనుకుని ఉన్న ఆస్తులను నిర్ధారించడాఇనకి అందించాల్సి ఉంటుంది. కుటుంబ వృక్ష సమాచారంతో సహా, పూర్వీకులు లేదా స్వాధీనం చేసుకున్న Land Owner గురించి వివరాలను అందించండి. ఇలా రుణం పొందడానికి అవసరమైన అన్ని పత్రాలను రెడీ చేసుకోవాలి.

ఆ తర్వాత ఆ పత్రాలను తీసుకుని సమీపంలో ఉన్న బ్యాంకులో అందజేయాలి. బ్యాంకు అధికారులు Documents ధృవీకరించి అవసరమైన విధానాలను నిర్వహిస్తారు. ఇలా మనం అవసరం అయిన పత్రాలను అందజేసిన తర్వాత బ్యాంకు అధికారులు వాటిని నిర్ధారించడానికి బ్యాంకులు వారి స్వంత ధృవీకరణ విధానాలను కలిగి ఉంటాయి. వారు రుణాన్ని అందించడం కోసం అన్ని రకాలుగా ఎంక్వయిరీలు చేస్తారు. పత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత, బ్యాంకు సిబ్బంది Loan Rules మరియు షరతుల గురించి వివరించే ఒప్పందాన్ని రెడీ చేస్తారు. ఇందులో మనం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వారు వెరిఫికేషన్ చేస్తారు. అన్నీ ఓకే అనుకుంటే వెంటనే వ్యవసాయ రుణాన్ని విడుదల చేస్తారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది