Ayodhya Ram Mandir : అయోధ్య తవ్వకాల్లో బయటపడ్డ పాదుకలు
Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతుంది. కొన్ని దశాబ్దాల నుండి నలుగుతూన్న రామ మందిర వివాదం సమసిపోవటంతో ఈ అద్భుతమైన నిర్మాణానికి పునాది పడింది. దీనితో మందిర నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఇందులో అనేక పురాతన విగ్రహాల ఆనవాలు, అదే విధంగా పాదుకాలు కూడా లభించినట్లు తెలుస్తుంది. వాటిని రామజన్మభూమి ట్రస్ట్ సురక్షితంగా భద్రపరిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో చరణ పాదుకలతో సహా అత్యంత ప్రాచీనమైన కొన్ని విగ్రహాల అవశేషాలు అక్కడ లభ్యమయ్యాయి. వీటిని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సురక్షితంగా భద్రపరచింది. వీటిని పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.
ఇవే కాకుండా గతంలో కూడా అనేక పురాతన విగ్రహాలు ఇక్కడ లభ్యమైన విషయం మనకి తెలిసిందే, వాటన్నిటిని రామాలయ నిర్మాణం అనంతరం ఇక్కడ నిర్మించబోయే మ్యూజియంలో ఈ ప్రాచీన విగ్రహాలను ఉంచనున్నారు. ప్రపంచంలో అత్యంత గొప్పదైన మందిరాన్ని ఇక్కడ నిర్మించటానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నడుము బిగించింది.
అయోధ్య మహా రామ మందిరం పొడవు 270 అడుగులు. వెడల్పు 140 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉండబోతుంది. దీని చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే నాలుగు చిన్న ఆలయాలు ఉండనున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లో రామ మందిర నిర్మాణం ప్లాన్ రూపొందించారు. దానికి తగ్గట్లే ప్రస్తుత నిర్మాణం జరుగుతుంది