Good News : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!
ప్రధానాంశాలు:
Good News : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!
Good News : ప్రతి ఇంట్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎంతగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న గుడిసెలో కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు. అంతగా ఇప్పుడు సిలిండర్లకు డిమాండ్ ఉంది. అయితే ఇన్ని రోజులు గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే వాటి ధరలు అలా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. పైగా ఏప్రిల్ 1న చమురు సంస్థలు మరో నిర్ణయం కూడా తీసుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకుంటాయి.
Good News ఒక్కో సిలిండర్‌పై రూ. 30.50
అయితే ఈ సారి మాత్రం సిలిండర్ వినియోగదారులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాయి చమురు సంస్థలు. ఒక్కో సిలిండర్‌పై రూ. 30.50 తగ్గిస్తు నిర్ణయం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1764.50కి చేరింది. అంతకుముందు ఇది రూ. 1795 గా ఉండేది. ఇక హైదరాబాద్ లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 25 పెరిగి రూ. 2027 కు చేరగా.. ఇప్పుడు రూ. 30.50 తగ్గింది. కమర్షియల్ సిలిండర్లు అంటే బయట హోట్సల్, రెస్టారెంట్లలో వినియోగించేవి అన్నమాట.
అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరలలో మాత్రం మార్పు లేదని స్పష్టం చేశాయి చమురు సంస్థలు. ఢిల్లీలో ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 గా ఉంది. హైదరాబాద్‌లో ఇది రూ. 855 గా ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల పథకం కింద వినియోగదారులకు రూ.300 ల వరకు సబ్సిడీ ఉంది. కాబట్టి వారికి వరుసగా రూ.503, రూ. 555 కే సిలిండర్ లభిస్తుందని చెబుతున్నారు. అయితే ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు సిలిండర్ ధరలను తగ్గించింది. అంతకు ముందు రాఖీ పండుగ, మహిళా దినోత్సవం సందర్భంగా వీటిని రూ.300 వరకు తగ్గించింది.దాంతో ధర రూ. 1100 కుపైనే ఉండగా.. ఇప్పుడు అది రూ. 800 స్థాయికి దిగొచ్చింది. ఇక ఇప్పుడు ఇందులో కూడా రూ.300 సబ్సిడీ రావడంతో అది కాస్తా ఇప్పుడు రూ.500లకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ఇక తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పై రూ.500 వరకు తగ్గించి ఇస్తున్న సంగతి తెలిసిందే.