Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్… ఈ స్కీమ్ ద్వారా వారికి ప్రయోజనాలు…!
Ration Card : రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు రకాల సంక్షేమాలకు ఎప్పటికప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కలిగి ఉన్నవారు మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే దారిధ్ర్యపు రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకం కింద ప్రతినెల కుటుంబానికి 35 కిలోల ధాన్యాన్ని సబ్సిడీగా అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని చెక్కెర, గోధుమలు లేదా బియ్యంతో కూడా అందిస్తారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏఏవై కార్డు ఉన్నవారికి పంచదార పంపిణీ చేసేందుకు రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే సుగర్ రాలేదని చెబుతూ ఏఏవై కార్డ్ దారులకు చక్కెరను సరిగా అందించడం లేదు.ఇక ఈ విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ వారందరికీ కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.జిల్లాల వారీగా అంతోద్యయ అన్న యోజన కార్డు కలిగి ఉన్న వారికి తప్పనిసరిగా చెక్కరను పంపిణీ చేయాలని ఆదేశించింది.
అయితే ప్రస్తుతానికి దేశంలో దాదాపు 1.89 కోట్ల మంది కుటుంబాలు అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కలిగి ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5.99 లక్షల మంది ఈ కార్డు కలిగి ఉన్నారు. దీంతో ఒక్కో కార్డుకు నెలకు 599 టన్నుల చక్కెర కేటాయించబడింది. ఇక ఈ మొత్తాన్ని పంపిణీ చేసే డీలర్లు ప్రతి కార్డుకు కేటాయించిన విధంగా చక్కెర పంపిణీ చేయాల్సి ఉంటుంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17,235 డిస్ట్రిబ్యూటర్లు ఉండగా వారిలో చాలామంది బియ్యానికి అనుకూలం చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపించడంతో వారికి పౌరసరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మార్కెట్ లీక్ 42 – 45 మధ్య ధర ఉంటే ఏఏవై కార్డు కలిగిన వారికి కిలో చక్కెర 13.50 సబ్సిడీ కింద ఇస్తున్నారు.
Ration Card అర్హులు ఎవరంటే….
భూమిలేని వ్యవసాయ కార్మికులు , సన్న కారు రైతులు , చెత్త సేకరించేవారు , రిక్షావారు , మురికివాడలో నివసించేవారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అంత్యోదయ అన్న యోజన ప్రయోజనాలకు అర్హులవుతారు. అలాగే ఎలాంటి ఆదాయ వనరులు లేని వితంతువులు 60 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ అంత్యోదయ రేషన్ కార్డు పొందాలంటే ఆ వ్యక్తికి కచ్చితంగా శాశ్వత ఇల్లు ఉండకూడదు. అలాగే వార్షిక ఆదాయం 20 వేలు కంటే మించి ఉండకూడదు.