7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. చాలా రోజుల నుంచి డీఏ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో పెరగాల్సిన డీఏ గత మార్చిలో పెరిగింది. రెండోసారి జూన్ లో పెరగాల్సిన డీఏ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. దానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. త్వరలోనే డీఏ పెరగనున్నట్టు తెలుస్తోంది. అది కూడా 4 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి జులై 31 వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ ను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత డీఏ పెంచాలో నిర్ణయిస్తారు. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం.. కనీసం 4 శాతం డీఏ పెరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. జనవరిలో పెరగాల్సిన డీఏ మార్చిలో పెరగగా అది 42 శాతం అయింది. ఒకవేళ ఇప్పుడు పెరిగే డీఏ చూస్తే 46 శాతానికి పెరిగే చాన్స్ ఉంది. ఒకవేళ 46 శాతానికి డీఏ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.
7th Pay Commission : డీఏ పెరిగితే ఏ నెల నుంచి పరిగణనలోకి తీసుకుంటారు?
ఒకవేళ డీఏ పెరిగితే జులై 1 నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. జులై నెలకి సంబంధించిన బకాయిలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ.. రక్షాబంధన్ లోపు ఈ ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. లేట్ అయినా కూడా వాటికి సంబంధించిన బకాయిలు జులై 1 నుంచి చెల్లిస్తారు కాబట్టి ఉద్యోగులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 46 శాతానికి డీఏ పెరిగితే ఉద్యోగుల జీతాలు మాత్రం భారీగా పెరకబోతున్నాయి.