Crime News : భార్య అందంగా ఉండటంతో అనుమానం పెంచుకొని.. చివరకు చంపేసి ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?
Crime News : పెళ్లి చేసుకున్న భార్య అందంగా ఉన్నా సమస్యే ఈరోజుల్లో. అందంగా లేకపోయినా సమస్యే. ఎందుకంటే.. భార్య అందంగా ఉంటే పది మంది కళ్లు తన మీదే ఉంటాయి. దీంతో తనను కాపాడుకోవడమే భర్త పని అవుతుంది. అదే అందంగా లేకపోతే.. తన భార్య అందంగా లేదని పది మంది పది రకాలుగా అనుకుంటారు. ఇలా.. ఎటువెళ్లినా చిక్కే కదా. ఇలాగే ఓ వ్యక్తి తన భార్య అందంగా ఉండటం వల్ల తన మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందేమో అని అనుమానించేవాడు. నిత్యం తనను వేధించేవాడు.

husband kills wife and informs family on whatsapp in bengaluru
బెంగళూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తికి నాజ్ అనే 22 ఏళ్ల యువతితో గత సంవత్సరం జూన్ లో పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ నగరంలోని సుభాష్ నగర్ లో ఉంటున్నారు. అయితే.. నాజ్ బెంగళూరులోనే ఓ కంపెనీలో పని చేసేది. తను చాలా అందంగా ఉండటం వల్ల.. తన భార్య అందాన్ని చూసి హుస్సేన్ కు అనుమానం కలిగేది. ఆఫీసులో ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించేవాడు. కంపెనీలో ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నావా అని తరుచూ వేధించేవాడు. చివరకు కోపంతో ఇటీవల ఆమె గొంతు నులిమి చంపేశాడు.
Crime News : నాజ్ ను చంపేశా అని వాట్సప్ లో మెసేజ్ పెట్టిన హుస్సేన్
నాజ్ ను చంపేసి ఆ తర్వాత ఆమె సోదరుడికి ఉదయమే వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. తాను నాజ్ ను చంపేశానని.. వచ్చి ఆమె బాడీని తీసుకెళ్లాలని చెప్పాడు. షాక్ అయిన నాజ్ సోదరుడు వెంటనే బెంగళూరుకు చేరుకొని సోదరి మృతదేహాన్ని చూసి విలవిల్లాడాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. తనను నాజ్ కుటుంబ సభ్యులు ఏం చేస్తారో అని భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.