PM Modi : 3.0 ముహూర్తం ఫిక్స్‌.. జూన్ 8న మోదీ ప్ర‌మాణ‌స్వీకారం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Modi : 3.0 ముహూర్తం ఫిక్స్‌.. జూన్ 8న మోదీ ప్ర‌మాణ‌స్వీకారం..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  3.0 ముహూర్తం ఫిక్స్‌.. జూన్ 8న మోదీ ప్ర‌మాణ‌స్వీకారం..!

PM Modi : లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) కూటమి విజయం సాధించడంతో వరుసగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. జూన్ 8వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగస్వామ్యపక్షాలు పాల్గొననున్నాయి. కాగా బుధవారం మోదీ తన నివాసంలో మంత్రులతో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. ఆ తర్వాత కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు.

అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సొంతగా 241 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్డీఏ కూటమి 294 చోట్ల గెలిచింది. ఈ క్రమంలోనే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమి నేతలు ఆలోచనలు సాగిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. అక్కడే నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఆ తరవాతే తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. 1962 సంవత్సరం తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేతగానూ మోదీ రికార్డు సృష్టించనున్నారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై లక్షన్నర ఓట్ల తేడాతో విజయం సాధించారు.

PM Modi 30 ముహూర్తం ఫిక్స్‌ జూన్ 8న మోదీ ప్ర‌మాణ‌స్వీకారం

PM Modi : 3.0 ముహూర్తం ఫిక్స్‌.. జూన్ 8న మోదీ ప్ర‌మాణ‌స్వీకారం..!

వరుసగా మూడోసారి వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ సొంతంగా 370 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పటికీ యూపీ ఓటర్లు ఇచ్చిన షాక్‌తో పాటు ఇండీ కూటమి పుంజుకోవడంతో 241 స్థానాలకే పరిమితమైంది. కూటమితో కలిసి మొత్తంగా 294 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ కీలక నేతలతో మోదీ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకి ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనంత ఎక్కువ మందిని తమతో కలుపుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది