Rat : ఎలుకలు పట్టే ఉద్యోగం.. కోట్ల జీతం.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ప్రధానాంశాలు:
Rat : ఎలుకలు పట్టే ఉద్యోగం.. కోట్ల జీతం.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Rat : ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఎలుకలు కనిపిస్తూనే ఉంటాయి. అవి చేసే రచ్చ మాములుగా ఉండదు. అయితే ఎలుకల బెడద పోవాలి అంటే ‘పిల్లులను పెంచేస్తే సరి..’ అనే మాటలు తరుచూ వినిపిస్తుంటాయి. మూషికాలు వలన పంటలకి బాగా నష్టం కలుగుతుంది.వీటివల్ల కరువు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. ఎలుకల బెడద తప్పించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. వాటి బెడద నుండి తప్పించుకోవడానికి అనేక స్కెచ్‌లు కూడా వేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎలుకలని పట్టడానికి ఓ ఉద్యోగమే పెట్టారు. అంతేకాదు ఏడాదికి రూ. 1.2 కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు.. ఇది వినగానే మీరు షాక్‌కి గురి కావడం ఖాయం. కాని ఇది నిజం. ప్రపంచ ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మూషికాలు రెచ్చిపోతున్నాయి.
Rat : 900 మంది అప్లికేషన్ల నుంచి..
కొన్నేళ్లుగా న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ఎలుకల సమస్యతో బాధపడుతున్నాయి. సబ్ వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తూ భీబత్సం సృష్టిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోవడం ఇటీవల వార్తల్లోకి వచ్చింది కూడా. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించగా, ఈ ఉద్యోగానికి మొత్తం 900 మంది అప్లై చేసుకున్నారు.. వారిలో కేథలిన్ కొరాడీని ఎంపిక చేశారు.
ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేసిన ఆమె.. విద్యా శాఖలో ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై చిన్నపాటి రీసెర్చ్ చేశారట.ఇప్పుడు ఆమె చేసే పని ఏంటంటే… ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరక్కుండా డిస్పోస్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్ వేలలో ఎలుకలు ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడమేనట. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. , విష పదార్థాలను పెట్టి ఎలుకలను చంపకూడదని షరతు విధించారు. ఎందుకంటే గతంలో ఆలా చేయడం వల్ల చనిపోయిన ఆ ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు మృత్యువాతపడ్డాయి.