Lord Ganesha | వినాయకుడి వాహనాల వెనక ఆసక్తికర పురాణ కథలు.. ప్రతి యుగంలో ఓ ప్రత్యేక రూపం
Lord Ganesha | హిందూ సంస్కృతిలో విఘ్నేశ్వరుడు అంటే అనుదినం ప్రతి కార్యానికి ఆరంభంలో పూజించే దేవుడు. వినాయక చవితి వేళ, ఆయన రూపాన్ని ఘనంగా అలంకరించి భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే విభిన్న యుగాల్లో వినాయకుడికి వాహనాలు మారుతూ ఉండడం, వాటి వెనుక ఉన్న పురాణ కధలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.

#image_title
ఇది కారణం..
యుగాలకనుగుణంగా గణేశుడి వాహనాలు మారుతున్నాయి. సత్యయుగం లో గణేశుడు సింహాన్ని వాహనంగా కలిగి ఉన్నారు. త్రేతాయుగం లో గణపతి నెమలిని వాహనంగా కలిగి ఉన్నారు. అందుకే ఆయనను “మయూరేశ్వరుడు” అని పిలుస్తారు. ద్వాపరయుగంలో గణేశుడి వాహనం మనకు బాగా తెలిసిన ఎలుక. గజాననుడిగా పిలవబడే ఈ రూపం నాలుగు చేతులతో, ఎరుపు రంగుతో దర్శనమిస్తాడు. గణనాయకుడి మూడవ యుగ అవతారంగా ఈ రూపం నిలుస్తుంది.
కలియుగంలో గణేశుడి వాహనం గుర్రం లేదా ఏనుగు. ధూమ్రకేతు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఈ రూపంలో ఆయన రెండు చేతులు కలిగి ఉండగా, పొగలాంటి రంగుతో దర్శనమిస్తాడు. ఎలుక గణపతి వాహనం ఎలా అయ్యింది అంటే..పురాణాల ప్రకారం ఒకప్పుడు క్రౌంచుడు అనే ముని, తన అహంకారంతో దేవతలకు ఇబ్బందులు కలిగించేవాడు. దాంతో ఇంద్రుడు శాపం ఇచ్చి అతన్ని ఎలుకగా మారుస్తాడు. ఆ ఎలుక భారీగా మారి ప్రజలకు హాని చేస్తూ తిరుగుతుండగా, రుషుల ప్రార్థన మేరకు గణేశుడు ప్రదర్శించిన పరాక్రమంతో పాశంతో ఎలుకను బంధించి, తన వాహనంగా చేసుకున్నారు. ఈ కథ స్కంద పురాణంలో ఉంది.