Pak : పరువు తీసుకున్న పాక్..నవ్వుకుంటున్న నెటిజన్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pak : పరువు తీసుకున్న పాక్..నవ్వుకుంటున్న నెటిజన్లు

 Authored By sudheer | The Telugu News | Updated on :15 August 2025,8:00 pm

పాకిస్తాన్ నాయకులు, అధికారులు చేసే పనులు తరచుగా అంతర్జాతీయ సమాజం ముందు వారి పరువు తీస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన పని నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించిందంటూ, ఆ ఘనతకు గాను దేశంలో రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన హిలాల్-ఎ-జురాత్‌ను తనకు తానే ప్రకటించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నిజానికి ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలు అయిన సంఘటన. ఎందుకంటే భారత దాడులకు పాక్ బెంబేలెత్తి, యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Pak పరువు తీసుకున్న పాక్నవ్వుకుంటున్న నెటిజన్లు

Pak : పరువు తీసుకున్న పాక్..నవ్వుకుంటున్న నెటిజన్లు

ఆపరేషన్ సింధూర్‌లో భారత్ చేసిన శక్తివంతమైన దాడుల నుంచి తమ వైమానిక స్థావరాలను, సైనిక మౌలిక సదుపాయాలను కూడా రక్షించుకోవడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. అయినప్పటికీ అసిమ్ మునీర్ తామే గెలిచామని ప్రకటించుకుని, తనకు తానే అవార్డు ప్రకటించుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. “ఓడిపోయిన వారికి అవార్డులా?”, “సిగ్గుందా అసిమ్ మునీర్?” అంటూ రకరకాల ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు ఫన్నీగా విమర్శలు చేస్తున్నారు. గతంలో భారత దాడులకు భయపడి పాక్ సైన్యం వెనక్కి తగ్గింది. ఇలాంటి సమయంలో కూడా గెలిచామని చెప్పుకోవడం పాకిస్తాన్‌కు అలవాటే అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దెబ్బకు పాకిస్తాన్ తోకముడిచినప్పటికీ, ఆ దేశం మాత్రం తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంటోంది. భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను దాటుకుని మరీ దాడులు చేశామని డబ్బా కొట్టుకుంటోంది. అయితే, పాక్ చెబుతున్న ఈ అబద్ధాలను ప్రపంచ దేశాలు ఏమాత్రం విశ్వసించడం లేదు. అయినప్పటికీ, పాకిస్తాన్ అదే కథను మళ్లీ మళ్లీ చెబుతూ తన పరువును తానే గంగలో కలుపుకుంటోంది. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ దాడులు ఆపాలని పాకిస్తాన్ వేడుకుందని ప్రపంచానికి తెలుసు. ఈ విషయం తెలిసినప్పటికీ, పాకిస్తాన్ ఇలాంటి చేష్టలు చేయడం వల్ల అంతర్జాతీయంగా నవ్వులపాలు అవుతోంది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది