PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త… పీఎం కిసాన్ 17వ విడత విడుదల…!
ప్రధానాంశాలు:
PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త... సీఎం కిసాన్ 17వ విడత విడుదల...!
PM Kisan : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన లబ్ధిదారులకు శుభవార్త. పీఎం కిసాన్ యోజన 17వ విడత కోసం దేశంలోని అర్హులైన రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అయితే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 17వ విడత సీఎం కిసాన్ యోజన నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ అర్హులైన రైతులందరికీ డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తూ వస్తుంది.
ఈ నేపథ్యంలోనే మే నెలలో పీఎం కిసాన్ యోజన సంబంధించి 17వ విడత నగదును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పీఎం కిసాన్ 16వ విడతను చివరిసారిగా ఫిబ్రవరి 28 2024న ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనిలో భాగంగా దాదాపు తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇక ఈ సమయంలో దాదాపు 21 వేల కోట్లకు పైగా నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు బదిలీ చేసింది.
PM Kisan : ముఖ్య లక్ష్యం…
అయితే దేశంలో వెనకబడిన , ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున మూడు విడతలుగా రూ.6000 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.అయితే ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ యోజన సంబంధించి 16 విడతలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. కానీ మే నెలలో రావాల్సిన 17వ విడత చెల్లింపులను త్వరలోనే బదిలీ చేయనుంది.. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త… పీఎం కిసాన్ 17వ విడత విడుదల…!
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కచ్చితంగా ఇవి చేయాల్సిందే..ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ యోజన 17వ విడత పొందాలంటే రైతులు కచ్చితంగా వారి యొక్క ల్యాండ్ డేటా సీడింగ్ మరియు ఆధార్ , బ్యాంకు ఖాతా లింకుతో పాటు ఈ కేవైసీ ని కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని చేసుకోనివారు పీఎం కిసాన్ పథకం కింద విడుదలయ్యే 17వ విడత నగదు పొందలేరు.