7th Pay Commission : రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బోనస్.. త్వరలోనే దసరా కానుక
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనా, రైల్వే ఉద్యోగులైనా, ఏ ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులైనా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే వాళ్లకు జీతాలు పెరగడం, డీఏ, డీఆర్, ఇతర అలవెన్సులు కూడా ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది. అలాగే.. దసరా, దీపావళి వస్తే బోనస్ ఇస్తారు. ఇలా.. రైల్వే ఉద్యోగులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అప్పుడప్పుడు ధర్నాలు, నిరసనలు చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్స్ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంటాయి.తాజాగా ఇండియన్ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఐఆర్ఈఎఫ్).. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ)ని పెంచాలని డిమాండ్ చేసింది. రైల్వేకు పీఎల్బీ పెంపుపై లేఖ రాసింది. నిజానికి ఈ బోనస్ ప్రతి సంవత్సరం దసరా, దీపావళి సమయంలో వస్తుంది.
నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అయిన గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన బోనస్ ను అందిస్తుంది. అదే.. గ్రూప్ డీ ఉద్యోగులకు మినిమం జీతం మాత్రమే పే చేస్తారు.నిజానికి ఏడో వేతన సంఘం జనవరి 1, 2016 న ప్రారంభమైంది. కానీ.. పీఎల్బీ మాత్రం ఇంకా ఆరో వేతన సంఘం ఫిక్స్ చేసిన మినిమం శాలరీ కిందనే లెక్కిస్తున్నారు. గ్రూప్ డీ ఉద్యోగులకు మినిమం శాలరీ రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. కానీ.. గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగులకు మినిమం శాలరీ రూ.7 వేలుగానే లెక్కిస్తున్నారు. దాని వల్ల వాళ్లకు వచ్చే పీఎల్బీ రూ.17,951 మాత్రమే.
7th Pay Commission : ఇంకా ఆరో వేతన సంఘం ప్రకారమే లెక్కలు వేస్తున్నారని ఆరోపణ
అందుకే.. 18 వేల మినిమం శాలరీ కింద లెక్కించి పీఎల్బీని రూ.46,159గా బోనస్ ఇవ్వాలని రైల్వే యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే.. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు త్వరలోనే డీఏ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనుంది. అంటే దసరా, దీపావళి కానుకగా ఒకేసారి బోనస్, డీఏ రెండూ పెరిగే చాన్స్ ఉంది.