Ration Card : రేషన్ కార్డ్ దారులకు శుభవార్త… ప్రతి నెల 5000 పొందండిలా…!
ప్రధానాంశాలు:
Ration Card : రేషన్ కార్డ్ దారులకు శుభవార్త... ప్రతి నెల 5000 పొందండిలా...!
Ration Card : రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ కార్డు ఉన్నవారు నెలకి 5000 రూపాయలు ప్రతినెలా ఈ పథకం ద్వారా పొందవచ్చు. కావున రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందింది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లైతే…
Ration Card అటల్ పెన్షన్ యోజన పథకం
వృద్ధాప్యంలో ఉన్న వారికి అలాగే యువత మరియు మహిళలకు ఆర్థిక సహాయం కల్పించేందుకు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015 లోనే బడ్జెట్ సమర్పణ లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని ప్రాథమిక మరియు అసంఘటిత రంగాలను లక్ష్యంగా చేసుకొని దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం పెన్షన్ ఫండ్ నియంత్రణ మరియు అభివృద్ధి కింద అన్ని వర్గాల ప్రజలకు వర్తిస్తుంది.
ఇక ఈ పథకానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాను కచ్చితంగా కలిగి ఉండాలి. లేనిచో పోస్ట్ ఖాతా అయిన కలిగి ఉండాలి. ఈ పథకం ద్వారా ప్రతినెల కనీసం 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందడానికి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వారి బ్యాంకులో డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతినెల 5000 చొప్పున పెన్షన్ డబ్బు మీ జన్ ధన్ యోజన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
కావున మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే జన్ ధన్ యోజన ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా భారత తపాలా శాఖలో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం కాబట్టి ఎలాంటి చిక్కులు లేకుండానే చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చు. తద్వారా ప్రతి నెల 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందవచ్చు.