Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త… కేంద్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్, స్టప్…!
ప్రధానాంశాలు:
Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త... కేంద్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్, స్టప్...!
Ration Card : రేషన్ కార్డు లబ్ధిదారులకు బంపర్ ఆఫర్. ఇప్పుడు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ ను పొందవచ్చు. అవును మీరు వింటున్నది నిజమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీమ్ కింద రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. మరి ఈ పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి..?దీనికి ఎలా అప్లై చేసుకోవాలి…?ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి…వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
Ration Card : ప్రధానమంత్రి ఉజ్వల యోజన…
భారతదేశంలో పేద మహిళలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇక ఈ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి ఏడాది రెండు సంవత్సరాల వరకు సిలిండర్లను అందుకుంటారు. అయితే దేశంలోని లక్షలాది పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ అందించాలనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకాన్ని 2016 మే 1న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమలులో ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వెనకబడిన వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది.
Ration Card : అర్హులు ఎవరంటే…
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
దరఖాస్తుదారుల వయస్సు కచ్చితంగా 18 సంవత్సరాల నిండి ఉండాలి.
అదేవిధంగా కుటుంబం యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే 1లక్ష , పట్టణ ప్రాంతాలలో అయితే 2 లక్షలకు మించి ఉండకూడదు.
అలాగే అభ్యర్థులకు ఇంతకుముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.
కావలసిన పత్రాలు…
కుటుంబ సభ్యుల ఆధార్ , రేషన్ కార్డ్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్ , బ్యాంక్ అకౌంట్.
అప్లై చేయు విధానం…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు ముందుగా సంబంధిత ఆఫీసులు వెబ్ సైట్ www.pmuy.gov.in/ సందర్శించాలి.
హోమ్ పేజీ లోకి వెళ్లిన తర్వాత అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న click here to apply for new ujwala 2.0 connection పైన క్లిక్ చేయాలి
ఆ తర్వాత సంబంధిత గ్యాస్ కంపెనీ ఎంచుకోవాలి.
మొబైల్ నెంబర్ మరియు ఓటిపి సహాయంతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న సమయంలో కచ్చితంగా పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు కరెక్ట్ గా ఇవ్వాలి.
అనంతరం దరఖాస్తు సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
మీరు అప్లై చేసిన ఫామ్ లో డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే వెరిఫికేషన్ అనంతరం కొత్త కనెక్షన్ పొందుతారు.
అలాగే మీకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియకపోతే ఎల్పిజీ డిస్ట్రిబ్యూటర్ అవుట్ లెట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తొలిసారి గ్యాస్ సిలిండర్ తో పాటు స్టవ్ కూడా ఫ్రీగా వస్తుంది. రెండవసారి నుండి గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ లభిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా ఏట 12 గ్యాస్ సిలిండర్ల పై సబ్సిడీని పొందవచ్చు.