Gas Cylinder : రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు ఎంపికయ్యారా… లేదా…?? ఇలా చెక్ చేసుకోండి…!
ప్రధానాంశాలు:
Gas Cylinder : రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు ఎంపికయ్యారా... లేదా...?? ఇలా చెక్ చేసుకోండి...!
Gas Cylinder : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అనేది ఇస్తూ ఉండగా. కొత్తగా తెలంగాణ రాష్ట్ర, ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై ఒక భారీ పథకాన్ని అయితే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ తరుణంలో గ్యాస్ సబ్సిడీ మీకు అందుబాటులో ఉన్నదో లేదో అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజులలో LPG గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు అంటూ ఏదీ లేదు. క్రమంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ గ్యాస్ సిలిండర్ల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. అయితే వారిని ప్రోత్సహించేందుకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాల్లో తీసుకొని గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అనేది ఇస్తున్నారు…
సహజ వాయువు మరియు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణం వలన కూడా భారత దేశంలో ప్రస్తుత కాలంలో LPG గ్యాస్ ధరలు అనేవి చాలా బాగా పెరిగిపోయ యి. దీని ఫలితంగా LPG ధరల పెంపు ప్రభవాన్ని కూడా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రజలకు LPG సబ్సిడీలు కూడా అమలు చేస్తుంది. LPG సబ్సిడీకి అర్హత పొందటానికి మీరు మీ LPG సర్వీస్ ప్రొవైడర్ కు మీ ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాక మీ బ్యాంక్ ఖాతాలో మీ ఆధార్ కార్డు కూడా లింక్ చేయాలి. అలా అయితే మీరు ప్రభుత్వ సబ్సిడీకి అర్హులు అవుతారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తూ ఉండగా, కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్ పై భారీ పథకాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే. కావున తెల్ల రేషన్ కార్డు కలిగిన LPG గ్యాస్ వినియోగదారులకు 500 కే గ్యాస్ ఇస్తాము అని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అధికారికంగా మొదలవుతుంది. కానీ ఈ పథకంలో నేరుగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తూ ఉండగా,డెలివరీ టైం లో పూర్తి మొత్తాన్ని తీసుకొని 500 కు పైగా చెల్లించిన మొత్తాన్ని అర్హులకు సబ్సిడీగా అందజేస్తూ ఉన్నారు.
ప్రభుత్వ సబ్సిడీ మీ ఖాతాలో ఉన్నదో లేదో ఎలా చూసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు. కొంత మందికి బ్యాంకుల నుండి ఎస్ఎంఎస్ వస్తున్న అసలు సబ్సిడీ వస్తున్నదో రాదో అనే విషయం పై మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి టెన్షన్లు ఏమి లేకుండా సబ్సిడీ సొమ్ము మీ ఖాతాలో ఉన్నదో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సబ్సిడీ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా www.mylpg.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. దీనిలో లాగిన్ ఆప్షన్ దగ్గర లాగిన్ అయ్యి ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది తెరుచుకోగానే వెబ్ పేజీ ఎగువన గ్యాస్ చిత్రాలను చూపుతుంది. అప్పుడు మీ సిలిండర్ ఏ కంపెనీకి చెందిందో ఆ కంపెనీని ఎంచుకోవాలి. అంటే మీరు మీ గ్యాస్ లో భారత్ గ్యాస్ HP గ్యాస్,ఇండియన్ గ్యాస్ నుండి ఎంచుకోవాలి.
దాని తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ సిలిండర్ కు సబ్సిడీ ఉందా లేదా అనేది ప్రదర్శిస్తుంది. మీ పేరు కూడా నమోదు అయినట్లుగా మీకో సబ్సిడీ లభిస్తే లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800233355 కు కాల్ చేసి నెంబర్ తో ఫిర్యాదు చేయవచ్చు. మీరు https://cx.indianoil.in/EPICIOCL/faces/GrievanceMainPage.jsPx లింకులు సందర్శించటం వలన సబ్సిడీని తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా LPG ఎంపికలు ఎంచుకోవాలి. సబ్సిడీ ఎంపికపై క్లిక్ చేయాలి. మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేక గ్యాస్ కనెక్షన్ ఐడి వివరాలను కూడా నమోదు చేయాలి. అప్పుడు మీరు సబ్సిడీ వివరాలను చూసుకోవచ్చు. చివరి ఐదు సిలిండర్లలో బుకింగ్ సమాచారం అనేది ఉంటుంది…