7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బోనాంజా.. దీపావళి గిఫ్ట్.. భారీగా పెరగనున్న జీతాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బోనాంజా.. దీపావళి గిఫ్ట్.. భారీగా పెరగనున్న జీతాలు

7th Pay Commission : దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే చాలు.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతాయి. బోనస్ లు ప్రకటిస్తాయి. స్వీట్ల డబ్బాలు పంచుతాయి. ఇలా.. కంపెనీ లాభాలకు అనుగుణంగా ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్ లను అందిస్తుంటాయి. దీపావళి అనేది అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ కావడంతో ఆ పండుగ నాడు తమ ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బోనస్ లను ప్రకటిస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 October 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  డీఏ పెంపుతో సంబురాలు చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

  •  42 నుంచి 46 శాతానికి పెరిగిన డీఏ

  •  రాష్ట్రంలో ఉన్న 16 లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి

7th Pay Commission : దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే చాలు.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతాయి. బోనస్ లు ప్రకటిస్తాయి. స్వీట్ల డబ్బాలు పంచుతాయి. ఇలా.. కంపెనీ లాభాలకు అనుగుణంగా ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్ లను అందిస్తుంటాయి. దీపావళి అనేది అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ కావడంతో ఆ పండుగ నాడు తమ ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బోనస్ లను ప్రకటిస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీపావళి దమాకా ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతంగా డీఏ ఉంది. దాన్ని 42 శాతం నుంచి 46 శాతానికి చేసింది. దీపావళి సందర్భంగా 4 శాతం డీఏను పెంచడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

పెరిగిన డీఏ కూడా జులై 1 నుంచి అమలు కావడంతో జులై నుంచి అక్టోబర్ నెల వరకు ఉన్న బకాయిలను కూడా ప్రభుత్వం అక్టోబర్ జీతంలో కలిసి దీపావళి సందర్భంగా వేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు వల్ల భారీగా లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెంచుతుంది. జులైలో పెరగాల్సిన డీఏను దీపావళి కానుకగా ఇప్పుడు పెంచారు. డీఏను 4 శాతం పెంచుతున్నామని సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.2546 కోట్ల అదనపు భారం పడుతుంది.

7th Pay Commission : గత వారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ

దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత వారమే కేంద్రం 4 శాతం డీఏ పెంచింది. వాళ్లకు కూడా 42 శాతంగా ఉన్న డీఏ 46 శాతానికి పెరిగింది. పెంచిన డీఏను జులై 1 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఇక.. దసరా సందర్భంగా రైల్వే శాఖ కూడా తమ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను ప్రకటించింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది