Thyagarajan : రూ.6 వేల కోట్లను తృణప్రాయంగా వదిలేశాడు.. సెల్ ఫోన్ కూడా లేని ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే
Thyagarajan : మీరు ఎప్పుడైనా ఆర్. త్యాగరాజన్ అనే పేరు విన్నారా? పోనీ.. శ్రీరామ్ గ్రూప్ ఫైనాన్స్ పేరు విన్నారా ఎప్పుడైనా? దానికి ఆయనే చైర్మన్. కానీ.. ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే.. చాలామందికి శ్రీరామ్ ఫైనాన్స్ పేరుతో ఆశాదీపం అయ్యారు. 1974 లో శ్రీరామ్ గ్రూప్ ను ఆయన స్థాపించారు. పేదలకు అవసరాలకు రుణాలు ఇచ్చే సంస్థ అది. పేదలు ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా.. ఉపాధి కోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు కొనుక్కోవాలన్నా రుణం ఇచ్చేవారు. చాలా బ్యాంకులు అందరికీ లోన్స్ ఇవ్వవు కాబట్టి ఆయన తన గ్రూప్ ద్వారా రుణాలు అందించేవారు. బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకోలేని వారికి, పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఆశాదీపం అయ్యారు.
అంతే కాదు.. శ్రీరామ్ ఫైనాన్స్, బీమా సంస్థ నుంచి చివరకు స్టాక్ బ్రోకింగ్ వరకు లక్ష మందికి పైగా ఉపాధి కల్పించారు. అలాగే.. ఇటీవల శ్రీరామ్ గ్రూప్ షేర్లు ఒకేసారి 35 శాతానికి జంప్ అయ్యాయి. దీంతో ఆ గ్రూప్ విలువ రూ.6 వేల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ.6200 కోట్ల విలువైన షేర్లు శ్రీరామ్ గ్రూప్ సంస్థ దగ్గర ఉండగా.. ఆ షేర్లను తన ఉద్యోగులకే ఇచ్చేశారు త్యాగరాజన్. ఆయన పేరులో ఉన్నట్టుగానే త్యాగరాజన్ త్యాగానికి చిరునామాగా నిలుస్తున్నారు.
Thyagarajan : నిరాడంబరమైన జీవితం ఆయనది
త్యాగరాజన్ ది చాలా నిరాడంబరమైన జీవితం. ఆయన వయసు ప్రస్తుతం 86 ఏళ్లు. కానీ.. ఇప్పటి వరకు ఆయన దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. ఎలాంటి సిబిల్ స్కోర్ లేకున్నా.. నెలవారి ఆదాయం లేకున్నా పేదలకు ఉపాధి కోసం రుణాలు ఇచ్చి పేదల పాలిట దేవుడిగా నిలిచాడు త్యాగరాజన్. ఇప్పుడు తన షేర్లను కూడా ఉద్యోగులకే ఇచ్చేసి ఆ వయసులో ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా నిరాడంబర జీవనాన్ని సాగిస్తున్నారు త్యాగరాజన్.