Vande Bharat Sleeper : రయ్యిన దూసుకుపోతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్.. 180 కి.మీ స్పీడ్‌లోను వణకని వాటర్ గ్లాస్
ప్రధానాంశాలు:
Vande Bharat Sleeper : రయ్యిన దూసుకుపోతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్.. 180 కి.మీ స్పీడ్‌లోను వణకని వాటర్ గ్లాస్
Vande Bharat Sleeper : వందే భారత్ ట్రైన్ బాగా క్లిక్ అవడంతో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ Vande Bharat Sleeper రైలుని త్వరలోనే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ట్రైన్ న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో నడవనుంది. ఇటివల ఈ రైలును పలు ప్రాంతాల్లో పరీక్షించారు. ఆ క్రమంలో ఈ ట్రైన్ ఖచ్చితమైన వేగంతో దూసుకెళ్లింది. అదే సమయంలో ట్రైన్‌లో నీటితో నింపిన ఓ గ్లాసు glass నుంచి చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. అందుకు సంబంధించిన ఓ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Vande Bharat Sleeper ట్రయల్ రన్..
ఈ వీడియో చూసిన తర్వాత ట్రైన్ పనితీరును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.కొత్తగా సిద్ధం చేసిన వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు పరీక్షల నిమిత్తం ఇటివల కోటకు వచ్చింది. అక్కడ దానిపై బరువు ఉంచి, వేర్వేరు వేగంతో ఖాళీగా రన్ run చేయడం ద్వారా పరీక్షించారు. అందులో బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్‌లను పరీక్షించారు. ఈ రైలును గంటకు 180 కి.మీ వేగంతో నడిపారు. ఈ పరీక్ష డిసెంబర్ 31 నుంచి కోట రైల్వే డివిజన్‌లోని ఢిల్లీ-ముంబై రైల్వే ట్రాక్‌పై ప్రారంభమైంది.
వందేభారత్ స్లీపర్ టెస్టింగ్ మూడో రోజు గురువారం thursday కూడా జరిగింది. దీని కింద కోటా నుంచి లాబన్ మధ్య 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణికుల సమాన బరువును ఉంచుతూ వందే భారత్ 180 కి.మీ వేగంతో నడపబడింది.