Crime News : ఆన్ లైన్ లో బాలికకు పరిచయం అయ్యాడు.. తన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే?
Crime News : స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ.. ఒక్కోసారి ఆ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయి అని ఇటువంటి ఘటనల గురించి తెలిసినప్పుడు అర్థం అవుతుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. 10 వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికకు తన తండ్రి కరోనా సమయంలో స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఆన్ లైన్ క్లాసెస్ కోసం ఆ బాలిక ఆ ఫోన్ ను వాడేది. అయితే.. ఖాళీ సమయంలో ఆ ఫోన్ లో రకరకాల గేమ్స్ ఆడేది. అందులో ఓ గేమ్ ఆడుతూ ఒక యువకుడికి పరిచయం అయింది. ఇద్దరూ రోజూ గేమ్స్ ఆడుతూ తమ గురించి మాట్లాడుకునేవారు.

young boy misused girl photos online in madhyapradesh
ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. దీంతో కొన్నాళ్లకు ఆ బాలికకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ఐడీలను తీసుకొని వాటి నుంచి తన పర్సనల్ ఫోటోలను, వీడియోలను సేకరించి.. వాటిని ఎడిట్ చేసి అసభ్యకరంగా మార్చాడు. వాటిని ఆ బాలిక వాట్సప్ కు పంపించాడు. తనను బెదిరించారు. ఈ విషయాన్ని వెంటనే బాలిక తన తండ్రికి తెలిపింది. దీంతో అప్పటి నుంచి ఆ బాలిక తండ్రిని బెదిరించడం మొదలు పెట్టాడు ఆ యువకుడు.
Crime News : నీ కూతురును నా వద్దకు పంపు అంటూ బెదిరించిన ప్రబుద్ధుడు
నీ కూతురును నా వద్దకు పంపు. లేదంటే నీ కూతురు ఫోటోలు, వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ బెదిరించాడు ఆ యువకుడు. ఆ బాలిక తండ్రి దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలిక ఫోటోలను, వీడియోలను ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు. దీంతో బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.