Job Resign : అమెరికాలో 1.6 కోట్ల ఉద్యోగ ఖాళీలు.. ఒకే నెలలో 45 లక్షల మంది గుడ్ బై..!
Job resign : అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు మానేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొవిడ్ మహమ్మారి తర్వాత ఉద్యోగాలు చేసే వారిలో జీవితాల్లో చాలా మార్పులు సంభవించాయని తెలుస్తోంది. వర్క్ ఫ్రం హోం పేరిట కంపెనీలు తమ ఉద్యోగులకు టార్చర్ చూపించాయట.. అధిక పని ఒత్తిడితో పాటు ఎక్కువ గంటలు పనిచేయించారట.. దీంతో వారు ఈ ఉద్యోగాలు చేయడం కంటే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని లేదా ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలోకి మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.కొవిడ్ మహమ్మారి కారణంగా అమెరికాలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.
పనిలేక, బిజినెస్ లేక తమ ఉద్యోగులను కొందరు నిర్దాక్షిణ్యంగా తీసేసారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత చక్కబడటంతో పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదట.. మరికొందరైతే ఏకంగా అధికంగా సాలరీ ఆఫర్ చేస్తున్నా వారికి ఉద్యోగులు దొరకడం లేదు. కారణం కొవిడ్ టైంలో తమను యాజమాన్యాలు పట్టించుకోలేదని, మరికొందరు వర్క్ పేరుతో టార్చర్ చేసినట్టు సమాధానాలు వినిపిస్తున్నాయి.అమెరికా కార్మిక శాఖ అంచనా ప్రకారం గతేడాది నవంబర్ నెలలో ఏకంగా 45 లక్షల మంది తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారట.. సెప్టెంబరు నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య 3 శాతం పెరిగింది.
Job Resign : ఉద్యోగులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..
సాఫ్ట్వేర్, ఫుడ్ సర్వీస్, హెల్త్, రవాణా రంగాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉద్యోగాలు మానేస్తున్నట్టు తెలిసింది. మంచి వేతనం ఇచ్చే కొత్త ఉద్యోగాల కోసం వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఉద్యోగాలు వదిలేస్తున్న వారి వలన పెద్ద మొత్తం ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత అక్టోబరు నాటికి 1.11 కోట్ల ఉద్యోగాలు అమెరికాలో అందుబాటులో ఉండగా, నవంబరు కల్లా ఆ సంఖ్య 1.6 కోట్లకు చేరింది. కరోనా క్రియేట్ చేసిన సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఫలితంగా ఉద్యోగాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.