Today Gold Rates : మహిళలకు మరోసారి గుడ్ న్యూస్.. స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు మరోసారి గుడ్ న్యూస్.. స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 July 2022,9:00 am

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం ధర పెరగగా.. వెండి ధరలు తగ్గాయి. నిన్న, ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

2022 april 12th today gold rates in telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.48000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.5234 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.52,340 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.52,480 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,340 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో అదే ధర ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,340 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57.80 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.578 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.640 కాగా.. కిలో వెండి ధర రూ.64000 గా ఉంది.

ముంబై, డిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.578 కాగా.. కిలో వెండి ధర రూ.57800 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.640 కాగా.. కిలో వెండి ధర రూ.64000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది