Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే..?
ప్రధానాంశాలు:
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే..?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. గతంలో అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.10వేలు మాత్రమే చెల్లించేవారు. ఎన్నికల వాగ్ధానం అమలులో భాగంగా దాన్ని మరో రూ.5 వేలు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం త్వరలో విధివిధానాలను రూపొందించి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది. రైతులకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఈ ఏడాది నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. అంతే కాకుండా వ్యవసాయ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం “తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్” ఏర్పాటు చేసింది.
ఈ మేరకు రైతు భరోసాపై కేబినేట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు భరోసాపై చర్యలు వేగవంతం చేశారు. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగు లేని భూములకు రైతు భరోసా లేనట్లే నని ప్రకటించారు. దీంతో ఈ పథకంపై వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత యాసంగి పంటకు రైతు బంధు నిధులనే అందించింది. రైతు బంధు పథకంలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా దానికి పరిమితులు విధించాలని చెప్పారు. ఇందులో భాగంగా ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
ఈ నేపథ్యంలో రైతు భరోసా ను 5 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం 10 ఎకరల వరకు ఇవ్వాలని అంటున్నారు. మరో రెండు రోజుల్లో కేబినేట్ మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశంలోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. వచ్చే దసరా కానుకగా రైతులకు రైతు భరోసా నిధులను అందించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత వానకాలం పంటకే రైతు భరోసా ఇవ్వాలి. కానీ ఆ సమయంలో రైతు రుణ మాఫీ హడావిడి కారణంతో పాటు నిధుల లేమి కారణంగా రైతు భరోసాను వాయిదే వేశారని కొందరు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దసరా కానుకగా రైతు భరోసాను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.